Exodus 13 (IRVT2)

1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. 2 “ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.” 3 అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు. 4 అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు. 5 కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తరువాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి. 6 మీరు ఏడు రోజులపాటు పొంగని పదార్థం కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఏడవ రోజు యెహోవా పండగ ఆచరించాలి. 7 ఏడు రోజులూ పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకూ పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేదీ మీ దగ్గర కనబడకూడదు. 8 ఆ రోజు మీ పిల్లలకు ‘నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను’ అని చెప్పాలి. 9 యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా, ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదుటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది. 10 అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయకాలంలో ఆచరించాలి. 11 యెహోవా మీతో మీ పూర్వికులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తరువాత 12 మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే. 13 ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి. 14 ఇకముందు మీ కొడుకులు ‘ఇలా ఎందుకు చెయ్యాలి?’ అని అడిగితే, వాళ్ళతో, ‘ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు. 15 ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను’ అని చెప్పాలి. 16 యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీదా నొసటి మీదా ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి.” 17 ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్లనీయలేదు. “ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారేమో” అనుకున్నాడు. 18 అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు. 19 మోషే యోసేపు ఆస్తికలను వెంట తీసుకు వచ్చాడు. ఎందుకంటే యోసేపు “దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా ఆస్తికలను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళండి” అని ఇశ్రాయేలు ప్రజలతో కచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు. 20 వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు. 21 పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు. 22 దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు.

In Other Versions

Exodus 13 in the ANGEFD

Exodus 13 in the ANTPNG2D

Exodus 13 in the AS21

Exodus 13 in the BAGH

Exodus 13 in the BBPNG

Exodus 13 in the BBT1E

Exodus 13 in the BDS

Exodus 13 in the BEV

Exodus 13 in the BHAD

Exodus 13 in the BIB

Exodus 13 in the BLPT

Exodus 13 in the BNT

Exodus 13 in the BNTABOOT

Exodus 13 in the BNTLV

Exodus 13 in the BOATCB

Exodus 13 in the BOATCB2

Exodus 13 in the BOBCV

Exodus 13 in the BOCNT

Exodus 13 in the BOECS

Exodus 13 in the BOGWICC

Exodus 13 in the BOHCB

Exodus 13 in the BOHCV

Exodus 13 in the BOHLNT

Exodus 13 in the BOHNTLTAL

Exodus 13 in the BOICB

Exodus 13 in the BOILNTAP

Exodus 13 in the BOITCV

Exodus 13 in the BOKCV

Exodus 13 in the BOKCV2

Exodus 13 in the BOKHWOG

Exodus 13 in the BOKSSV

Exodus 13 in the BOLCB

Exodus 13 in the BOLCB2

Exodus 13 in the BOMCV

Exodus 13 in the BONAV

Exodus 13 in the BONCB

Exodus 13 in the BONLT

Exodus 13 in the BONUT2

Exodus 13 in the BOPLNT

Exodus 13 in the BOSCB

Exodus 13 in the BOSNC

Exodus 13 in the BOTLNT

Exodus 13 in the BOVCB

Exodus 13 in the BOYCB

Exodus 13 in the BPBB

Exodus 13 in the BPH

Exodus 13 in the BSB

Exodus 13 in the CCB

Exodus 13 in the CUV

Exodus 13 in the CUVS

Exodus 13 in the DBT

Exodus 13 in the DGDNT

Exodus 13 in the DHNT

Exodus 13 in the DNT

Exodus 13 in the ELBE

Exodus 13 in the EMTV

Exodus 13 in the ESV

Exodus 13 in the FBV

Exodus 13 in the FEB

Exodus 13 in the GGMNT

Exodus 13 in the GNT

Exodus 13 in the HARY

Exodus 13 in the HNT

Exodus 13 in the IRVA

Exodus 13 in the IRVB

Exodus 13 in the IRVG

Exodus 13 in the IRVH

Exodus 13 in the IRVK

Exodus 13 in the IRVM

Exodus 13 in the IRVM2

Exodus 13 in the IRVO

Exodus 13 in the IRVP

Exodus 13 in the IRVT

Exodus 13 in the IRVU

Exodus 13 in the ISVN

Exodus 13 in the JSNT

Exodus 13 in the KAPI

Exodus 13 in the KBT1ETNIK

Exodus 13 in the KBV

Exodus 13 in the KJV

Exodus 13 in the KNFD

Exodus 13 in the LBA

Exodus 13 in the LBLA

Exodus 13 in the LNT

Exodus 13 in the LSV

Exodus 13 in the MAAL

Exodus 13 in the MBV

Exodus 13 in the MBV2

Exodus 13 in the MHNT

Exodus 13 in the MKNFD

Exodus 13 in the MNG

Exodus 13 in the MNT

Exodus 13 in the MNT2

Exodus 13 in the MRS1T

Exodus 13 in the NAA

Exodus 13 in the NASB

Exodus 13 in the NBLA

Exodus 13 in the NBS

Exodus 13 in the NBVTP

Exodus 13 in the NET2

Exodus 13 in the NIV11

Exodus 13 in the NNT

Exodus 13 in the NNT2

Exodus 13 in the NNT3

Exodus 13 in the PDDPT

Exodus 13 in the PFNT

Exodus 13 in the RMNT

Exodus 13 in the SBIAS

Exodus 13 in the SBIBS

Exodus 13 in the SBIBS2

Exodus 13 in the SBICS

Exodus 13 in the SBIDS

Exodus 13 in the SBIGS

Exodus 13 in the SBIHS

Exodus 13 in the SBIIS

Exodus 13 in the SBIIS2

Exodus 13 in the SBIIS3

Exodus 13 in the SBIKS

Exodus 13 in the SBIKS2

Exodus 13 in the SBIMS

Exodus 13 in the SBIOS

Exodus 13 in the SBIPS

Exodus 13 in the SBISS

Exodus 13 in the SBITS

Exodus 13 in the SBITS2

Exodus 13 in the SBITS3

Exodus 13 in the SBITS4

Exodus 13 in the SBIUS

Exodus 13 in the SBIVS

Exodus 13 in the SBT

Exodus 13 in the SBT1E

Exodus 13 in the SCHL

Exodus 13 in the SNT

Exodus 13 in the SUSU

Exodus 13 in the SUSU2

Exodus 13 in the SYNO

Exodus 13 in the TBIAOTANT

Exodus 13 in the TBT1E

Exodus 13 in the TBT1E2

Exodus 13 in the TFTIP

Exodus 13 in the TFTU

Exodus 13 in the TGNTATF3T

Exodus 13 in the THAI

Exodus 13 in the TNFD

Exodus 13 in the TNT

Exodus 13 in the TNTIK

Exodus 13 in the TNTIL

Exodus 13 in the TNTIN

Exodus 13 in the TNTIP

Exodus 13 in the TNTIZ

Exodus 13 in the TOMA

Exodus 13 in the TTENT

Exodus 13 in the UBG

Exodus 13 in the UGV

Exodus 13 in the UGV2

Exodus 13 in the UGV3

Exodus 13 in the VBL

Exodus 13 in the VDCC

Exodus 13 in the YALU

Exodus 13 in the YAPE

Exodus 13 in the YBVTP

Exodus 13 in the ZBP