Exodus 40 (IRVT2)
1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. 2 “మొదటి నెల మొదటి రోజున నువ్వు సన్నిధి గుడారం ఉన్న మందిరాన్ని నిలబెట్టాలి. 3 అక్కడ శాసనాల పెట్టెను నిలబెట్టి దాన్ని అడ్డ తెరతో మూసి ఉంచాలి. 4 బల్లను లోపలికి తెచ్చి దాని మీద ఉంచవలసిన వాటిని క్రమంగా ఉంచాలి. దీప స్తంభాన్ని లోపలికి తెచ్చి దాని దీపాలు వెలిగించాలి. 5 శాసనాల పెట్టె ఎదురుగా బంగారు ధూపవేదికను ఉంచి, మందిర ద్వారానికి తెర తగిలించాలి. 6 సన్నిధి గుడారం ఉన్న మందిరం ద్వారం ఎదురుగా హోమ బలిపీఠం ఉంచాలి. 7 సన్నిధి గుడారం, హోమ బలిపీఠం మధ్యలో ఒక గంగాళం పెట్టి, దాన్ని నీళ్ళతో నింపాలి. 8 తెరల చుట్టూ ప్రహరీ నిలబెట్టి, ప్రహరీ ద్వారానికి తెర తగిలించాలి. 9 అభిషేక తైలం తీసుకుని దైవ నివాసాన్నీ, అందులోని వాటన్నిటినీ అభిషేకించాలి. దానినీ, దానిలోని సామగ్రి అంతటినీ ప్రతిష్టించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది. 10 హోమ బలిపీఠాన్ని అభిషేకించి, దాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆ పీఠం పవిత్రం అవుతుంది. 11 గంగాళాన్ని, దాని పీటను అభిషేకించి, వాటిని ప్రతిష్ఠించాలి. 12 తరువాత అహరోనును, అతని కొడుకులను సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి వెంటబెట్టుకుని తీసుకువచ్చి నీళ్లతో స్నానం చేయించాలి. 13 అతనికి పవిత్ర వస్త్రాలు తొడిగి అతడు నాకు యాజకుడుగా సేవ జరిగించడానికి అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి. 14 తరువాత అతని కొడుకులను తీసుకువచ్చి వాళ్లకు చొక్కాలు తొడిగించాలి. 15 వాళ్ళు కూడా నాకు యాజకులుగా ఉండేలా వాళ్ళ తండ్రిని అభిషేకించినట్టు వాళ్ళను అభిషేకించి ప్రతిష్టించు. వారి అభిషేకం తరతరాలకు నిత్యమూ నిలిచే యాజకత్వ చిహ్నంగా ఉంటుంది.” 16 మోషే ఆ విధంగా చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినదంతా జరిగించాడు. 17 రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున దైవ నివాస మందిరం నిలబెట్టాడు. 18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు దైవ నివాస మందిరం నిలబెట్టి దాని దిమ్మలు వేసి, దాని పలకలను నిలబెట్టి దాని అడ్డకర్రలు అమర్చి, స్తంభాలను నిలిపాడు. 19 యెహోవా మందిరం పైన గుడారం పరిచాడు. గుడారానికి పైకప్పు వేశాడు. 20 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు శాసనాలను మందసంలో ఉంచాడు. మందసాన్ని మోసే కర్రలను పెట్టెకు దూర్చి దానిపైన కరుణా స్థానం మూత ఉంచాడు. 21 మందసాన్ని యెహోవా మందిరంలోకి తెచ్చి అడ్డతెర వేలాడదీసి శాసనాల పెట్టెను కప్పాడు. 22 సన్నిధి గుడారంలో, దైవ సన్నిధి మందిరం ఉత్తర దిక్కున, అడ్డతెరకు బయట బల్లను ఉంచాడు. 23 యెహోవా సన్నిధి ఎదుట బల్ల మీద రొట్టెలను క్రమంగా పేర్చాడు. 24 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో మందిరానికి దక్షిణం వైపున బల్ల ఎదుట దీపస్తంభం ఉంచాడు. 25 యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు. 26 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచాడు. 27 ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యాలను కాల్చి ధూపం వేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాడు. 28 మందిర ద్వారానికి తెర ఏర్పాటు చేశాడు. అతడు దైవ సన్నిధి గుడారం ద్వారం దగ్గర హోమపీఠం ఉంచాడు. 29 యెహోవా హోమ బలిపీఠం మీద హోమబలి అర్పించి నైవేద్యం సమర్పించాడు. 30 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు దైవసన్నిధి గుడారానికి, హోమ పీఠానికి మధ్య గంగాళం ఉంచి శుభ్రపరచుకోవడానికి దానిలో నీళ్లు పోయించాడు. 31 అక్కడ మోషే, అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు. 32 వాళ్ళు యెహోవా గుడారం లోపలికి ప్రవేశించినప్పుడు, హోమపీఠం చెంతకు వచ్చినప్పుడు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు. 33 మోషే మందిరానికి, హోమపీఠానికి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశాడు. ఆవరణ ద్వారం తెర వేశాడు. ఈ విధంగా మోషే పని మొత్తం ముగించాడు. 34 అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది. 35 ఆ మేఘం యెహోవా సన్నిధి గుడారంపై నిలిచి ఉండడం వల్ల మందిరం యెహోవా తేజస్సుతో నిండిపోయింది. అందువల్ల మోషే యెహోవా సన్నిధి గుడారం లోపలి వెళ్ళలేక పోయాడు. 36 మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు. 37 ఆ మేఘం పైకి వెళ్ళకపోతే అది వెళ్ళే రోజు దాకా ప్రయాణం ఆపివేసే వాళ్ళు. ఇది వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి. 38 ఇశ్రాయేలు ప్రజలందరి సమక్షంలో పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది. రాత్రి సమయాల్లో మేఘంలో అగ్ని స్థంభం ఉండేది. ప్రజల ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగింది.
In Other Versions
Exodus 40 in the ANGEFD
Exodus 40 in the ANTPNG2D
Exodus 40 in the AS21
Exodus 40 in the BAGH
Exodus 40 in the BBPNG
Exodus 40 in the BBT1E
Exodus 40 in the BDS
Exodus 40 in the BEV
Exodus 40 in the BHAD
Exodus 40 in the BIB
Exodus 40 in the BLPT
Exodus 40 in the BNT
Exodus 40 in the BNTABOOT
Exodus 40 in the BNTLV
Exodus 40 in the BOATCB
Exodus 40 in the BOATCB2
Exodus 40 in the BOBCV
Exodus 40 in the BOCNT
Exodus 40 in the BOECS
Exodus 40 in the BOGWICC
Exodus 40 in the BOHCB
Exodus 40 in the BOHCV
Exodus 40 in the BOHLNT
Exodus 40 in the BOHNTLTAL
Exodus 40 in the BOICB
Exodus 40 in the BOILNTAP
Exodus 40 in the BOITCV
Exodus 40 in the BOKCV
Exodus 40 in the BOKCV2
Exodus 40 in the BOKHWOG
Exodus 40 in the BOKSSV
Exodus 40 in the BOLCB
Exodus 40 in the BOLCB2
Exodus 40 in the BOMCV
Exodus 40 in the BONAV
Exodus 40 in the BONCB
Exodus 40 in the BONLT
Exodus 40 in the BONUT2
Exodus 40 in the BOPLNT
Exodus 40 in the BOSCB
Exodus 40 in the BOSNC
Exodus 40 in the BOTLNT
Exodus 40 in the BOVCB
Exodus 40 in the BOYCB
Exodus 40 in the BPBB
Exodus 40 in the BPH
Exodus 40 in the BSB
Exodus 40 in the CCB
Exodus 40 in the CUV
Exodus 40 in the CUVS
Exodus 40 in the DBT
Exodus 40 in the DGDNT
Exodus 40 in the DHNT
Exodus 40 in the DNT
Exodus 40 in the ELBE
Exodus 40 in the EMTV
Exodus 40 in the ESV
Exodus 40 in the FBV
Exodus 40 in the FEB
Exodus 40 in the GGMNT
Exodus 40 in the GNT
Exodus 40 in the HARY
Exodus 40 in the HNT
Exodus 40 in the IRVA
Exodus 40 in the IRVB
Exodus 40 in the IRVG
Exodus 40 in the IRVH
Exodus 40 in the IRVK
Exodus 40 in the IRVM
Exodus 40 in the IRVM2
Exodus 40 in the IRVO
Exodus 40 in the IRVP
Exodus 40 in the IRVT
Exodus 40 in the IRVU
Exodus 40 in the ISVN
Exodus 40 in the JSNT
Exodus 40 in the KAPI
Exodus 40 in the KBT1ETNIK
Exodus 40 in the KBV
Exodus 40 in the KJV
Exodus 40 in the KNFD
Exodus 40 in the LBA
Exodus 40 in the LBLA
Exodus 40 in the LNT
Exodus 40 in the LSV
Exodus 40 in the MAAL
Exodus 40 in the MBV
Exodus 40 in the MBV2
Exodus 40 in the MHNT
Exodus 40 in the MKNFD
Exodus 40 in the MNG
Exodus 40 in the MNT
Exodus 40 in the MNT2
Exodus 40 in the MRS1T
Exodus 40 in the NAA
Exodus 40 in the NASB
Exodus 40 in the NBLA
Exodus 40 in the NBS
Exodus 40 in the NBVTP
Exodus 40 in the NET2
Exodus 40 in the NIV11
Exodus 40 in the NNT
Exodus 40 in the NNT2
Exodus 40 in the NNT3
Exodus 40 in the PDDPT
Exodus 40 in the PFNT
Exodus 40 in the RMNT
Exodus 40 in the SBIAS
Exodus 40 in the SBIBS
Exodus 40 in the SBIBS2
Exodus 40 in the SBICS
Exodus 40 in the SBIDS
Exodus 40 in the SBIGS
Exodus 40 in the SBIHS
Exodus 40 in the SBIIS
Exodus 40 in the SBIIS2
Exodus 40 in the SBIIS3
Exodus 40 in the SBIKS
Exodus 40 in the SBIKS2
Exodus 40 in the SBIMS
Exodus 40 in the SBIOS
Exodus 40 in the SBIPS
Exodus 40 in the SBISS
Exodus 40 in the SBITS
Exodus 40 in the SBITS2
Exodus 40 in the SBITS3
Exodus 40 in the SBITS4
Exodus 40 in the SBIUS
Exodus 40 in the SBIVS
Exodus 40 in the SBT
Exodus 40 in the SBT1E
Exodus 40 in the SCHL
Exodus 40 in the SNT
Exodus 40 in the SUSU
Exodus 40 in the SUSU2
Exodus 40 in the SYNO
Exodus 40 in the TBIAOTANT
Exodus 40 in the TBT1E
Exodus 40 in the TBT1E2
Exodus 40 in the TFTIP
Exodus 40 in the TFTU
Exodus 40 in the TGNTATF3T
Exodus 40 in the THAI
Exodus 40 in the TNFD
Exodus 40 in the TNT
Exodus 40 in the TNTIK
Exodus 40 in the TNTIL
Exodus 40 in the TNTIN
Exodus 40 in the TNTIP
Exodus 40 in the TNTIZ
Exodus 40 in the TOMA
Exodus 40 in the TTENT
Exodus 40 in the UBG
Exodus 40 in the UGV
Exodus 40 in the UGV2
Exodus 40 in the UGV3
Exodus 40 in the VBL
Exodus 40 in the VDCC
Exodus 40 in the YALU
Exodus 40 in the YAPE
Exodus 40 in the YBVTP
Exodus 40 in the ZBP