Genesis 28 (IRVT2)

1 ఇస్సాకు యాకోబును పిలిపించి “నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు. 2 నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒకామెను వివాహం చేసుకో 3 సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా 4 ఆయన నీకూ నీ సంతానానికీ అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు గాక” అని దీవించి పంపివేశాడు. 5 అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరకి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు బెతూయేలు కుమారుడూ యాకోబు, ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడూ. 6 ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెళ్ళి చేసుకుని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడనీ అతనిని దీవించినప్పుడు “నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోవద్దు” అని అతనికి ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసింది. 7 యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడనీ, 8 ఇదిగాక కనాను స్త్రీలు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ ఏశావు తెలుసుకున్నాడు. 9 అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్ళి చేసుకున్నాడు. 10 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ 11 ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు. 12 అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. 13 యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను. 14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. 15 ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు. 16 యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు. 17 అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. 18 పరలోకద్వారం ఇదే” అనుకున్నాడు.తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు. 19 అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు. 20 అప్పుడు యాకోబు “నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, 21 తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయ చేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. 22 అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను” అని మొక్కుకున్నాడు.

In Other Versions

Genesis 28 in the ANGEFD

Genesis 28 in the ANTPNG2D

Genesis 28 in the AS21

Genesis 28 in the BAGH

Genesis 28 in the BBPNG

Genesis 28 in the BBT1E

Genesis 28 in the BDS

Genesis 28 in the BEV

Genesis 28 in the BHAD

Genesis 28 in the BIB

Genesis 28 in the BLPT

Genesis 28 in the BNT

Genesis 28 in the BNTABOOT

Genesis 28 in the BNTLV

Genesis 28 in the BOATCB

Genesis 28 in the BOATCB2

Genesis 28 in the BOBCV

Genesis 28 in the BOCNT

Genesis 28 in the BOECS

Genesis 28 in the BOGWICC

Genesis 28 in the BOHCB

Genesis 28 in the BOHCV

Genesis 28 in the BOHLNT

Genesis 28 in the BOHNTLTAL

Genesis 28 in the BOICB

Genesis 28 in the BOILNTAP

Genesis 28 in the BOITCV

Genesis 28 in the BOKCV

Genesis 28 in the BOKCV2

Genesis 28 in the BOKHWOG

Genesis 28 in the BOKSSV

Genesis 28 in the BOLCB

Genesis 28 in the BOLCB2

Genesis 28 in the BOMCV

Genesis 28 in the BONAV

Genesis 28 in the BONCB

Genesis 28 in the BONLT

Genesis 28 in the BONUT2

Genesis 28 in the BOPLNT

Genesis 28 in the BOSCB

Genesis 28 in the BOSNC

Genesis 28 in the BOTLNT

Genesis 28 in the BOVCB

Genesis 28 in the BOYCB

Genesis 28 in the BPBB

Genesis 28 in the BPH

Genesis 28 in the BSB

Genesis 28 in the CCB

Genesis 28 in the CUV

Genesis 28 in the CUVS

Genesis 28 in the DBT

Genesis 28 in the DGDNT

Genesis 28 in the DHNT

Genesis 28 in the DNT

Genesis 28 in the ELBE

Genesis 28 in the EMTV

Genesis 28 in the ESV

Genesis 28 in the FBV

Genesis 28 in the FEB

Genesis 28 in the GGMNT

Genesis 28 in the GNT

Genesis 28 in the HARY

Genesis 28 in the HNT

Genesis 28 in the IRVA

Genesis 28 in the IRVB

Genesis 28 in the IRVG

Genesis 28 in the IRVH

Genesis 28 in the IRVK

Genesis 28 in the IRVM

Genesis 28 in the IRVM2

Genesis 28 in the IRVO

Genesis 28 in the IRVP

Genesis 28 in the IRVT

Genesis 28 in the IRVU

Genesis 28 in the ISVN

Genesis 28 in the JSNT

Genesis 28 in the KAPI

Genesis 28 in the KBT1ETNIK

Genesis 28 in the KBV

Genesis 28 in the KJV

Genesis 28 in the KNFD

Genesis 28 in the LBA

Genesis 28 in the LBLA

Genesis 28 in the LNT

Genesis 28 in the LSV

Genesis 28 in the MAAL

Genesis 28 in the MBV

Genesis 28 in the MBV2

Genesis 28 in the MHNT

Genesis 28 in the MKNFD

Genesis 28 in the MNG

Genesis 28 in the MNT

Genesis 28 in the MNT2

Genesis 28 in the MRS1T

Genesis 28 in the NAA

Genesis 28 in the NASB

Genesis 28 in the NBLA

Genesis 28 in the NBS

Genesis 28 in the NBVTP

Genesis 28 in the NET2

Genesis 28 in the NIV11

Genesis 28 in the NNT

Genesis 28 in the NNT2

Genesis 28 in the NNT3

Genesis 28 in the PDDPT

Genesis 28 in the PFNT

Genesis 28 in the RMNT

Genesis 28 in the SBIAS

Genesis 28 in the SBIBS

Genesis 28 in the SBIBS2

Genesis 28 in the SBICS

Genesis 28 in the SBIDS

Genesis 28 in the SBIGS

Genesis 28 in the SBIHS

Genesis 28 in the SBIIS

Genesis 28 in the SBIIS2

Genesis 28 in the SBIIS3

Genesis 28 in the SBIKS

Genesis 28 in the SBIKS2

Genesis 28 in the SBIMS

Genesis 28 in the SBIOS

Genesis 28 in the SBIPS

Genesis 28 in the SBISS

Genesis 28 in the SBITS

Genesis 28 in the SBITS2

Genesis 28 in the SBITS3

Genesis 28 in the SBITS4

Genesis 28 in the SBIUS

Genesis 28 in the SBIVS

Genesis 28 in the SBT

Genesis 28 in the SBT1E

Genesis 28 in the SCHL

Genesis 28 in the SNT

Genesis 28 in the SUSU

Genesis 28 in the SUSU2

Genesis 28 in the SYNO

Genesis 28 in the TBIAOTANT

Genesis 28 in the TBT1E

Genesis 28 in the TBT1E2

Genesis 28 in the TFTIP

Genesis 28 in the TFTU

Genesis 28 in the TGNTATF3T

Genesis 28 in the THAI

Genesis 28 in the TNFD

Genesis 28 in the TNT

Genesis 28 in the TNTIK

Genesis 28 in the TNTIL

Genesis 28 in the TNTIN

Genesis 28 in the TNTIP

Genesis 28 in the TNTIZ

Genesis 28 in the TOMA

Genesis 28 in the TTENT

Genesis 28 in the UBG

Genesis 28 in the UGV

Genesis 28 in the UGV2

Genesis 28 in the UGV3

Genesis 28 in the VBL

Genesis 28 in the VDCC

Genesis 28 in the YALU

Genesis 28 in the YAPE

Genesis 28 in the YBVTP

Genesis 28 in the ZBP