Song of Songs 7 (IRVT2)
1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)రాకుమారీ, చెప్పులు తొడిగిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! నీ తొడల వంపులు నిపుణుడైన కంసాలి పనితనంతో చేసిన ఆభరణాల్లాగా ఉన్నాయి. 2 నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది.కలిపిన ద్రాక్షారసం దానిలో ఎప్పుడూ వెలితి కాదు. నీ నడుము లిల్లీ పూలు చుట్టిన గోదుమరాశిలా ఉంది. 3 నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి. 4 నీ మెడ దంతగోపురంలా ఉంది.నీ కళ్ళు బత్ రబ్బీం ద్వారం దగ్గరున్న హెష్బోను జలాశయాల్లా ఉన్నాయి.నీ నాసిక దమస్కు వైపు చూస్తున్న లెబానోను శిఖరంలా ఉంది. 5 నీ తల కర్మెలు పర్వతంలా ఉంది.నీ జుట్టు ముదురు ఊదా రంగు.నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు. 6 నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు! 7 నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు.నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి. 8 “ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను.నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి. 9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి.మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి. 10 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)నేను నా ప్రియుడికి చెందిన దాన్ని.అతడు నా కోసం తహతహలాడుతున్నాడు. 11 ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో రాత్రి గడుపుదాం. 12 పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో,వాటి పూల గుత్తులు వికసించాయో లేదో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయో లేదో చూద్దాం పద.అక్కడే నీకు నేను నా ప్రేమ పంచుతాను. 13 మాండ్రేక్ మొక్కలు కమ్మని సువాసనలీనుతున్నాయి.మా ఇంటి తలుపు దగ్గర చవులూరించే రక రకాల పళ్ళు కొత్తవీ పాతవీ ఉన్నాయి. ప్రియా, నేను నీ కోసం వాటిని దాచి ఉంచాను.
In Other Versions
Song of Songs 7 in the ANTPNG2D
Song of Songs 7 in the BNTABOOT
Song of Songs 7 in the BOATCB2
Song of Songs 7 in the BOGWICC
Song of Songs 7 in the BOHNTLTAL
Song of Songs 7 in the BOILNTAP
Song of Songs 7 in the BOKHWOG
Song of Songs 7 in the KBT1ETNIK
Song of Songs 7 in the TBIAOTANT