Genesis 1 (IRVT2)

1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2 భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. 3 దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. 4 ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. 5 దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు. 6 దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. 7 దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. 8 దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు. 9 దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10 దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది. 11 దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 12 వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 13 రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు. 14 దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. 15 భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది. 16 దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. 17 భూమికి వెలుగు ఇవ్వడానికీ, 18 పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 19 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు. 20 దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. 21 దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 22 దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. 23 రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు. 24 దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 25 దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 26 దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు. 28 దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి. 30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

In Other Versions

Genesis 1 in the ANGEFD

Genesis 1 in the ANTPNG2D

Genesis 1 in the AS21

Genesis 1 in the BAGH

Genesis 1 in the BBPNG

Genesis 1 in the BBT1E

Genesis 1 in the BDS

Genesis 1 in the BEV

Genesis 1 in the BHAD

Genesis 1 in the BIB

Genesis 1 in the BLPT

Genesis 1 in the BNT

Genesis 1 in the BNTABOOT

Genesis 1 in the BNTLV

Genesis 1 in the BOATCB

Genesis 1 in the BOATCB2

Genesis 1 in the BOBCV

Genesis 1 in the BOCNT

Genesis 1 in the BOECS

Genesis 1 in the BOGWICC

Genesis 1 in the BOHCB

Genesis 1 in the BOHCV

Genesis 1 in the BOHLNT

Genesis 1 in the BOHNTLTAL

Genesis 1 in the BOICB

Genesis 1 in the BOILNTAP

Genesis 1 in the BOITCV

Genesis 1 in the BOKCV

Genesis 1 in the BOKCV2

Genesis 1 in the BOKHWOG

Genesis 1 in the BOKSSV

Genesis 1 in the BOLCB

Genesis 1 in the BOLCB2

Genesis 1 in the BOMCV

Genesis 1 in the BONAV

Genesis 1 in the BONCB

Genesis 1 in the BONLT

Genesis 1 in the BONUT2

Genesis 1 in the BOPLNT

Genesis 1 in the BOSCB

Genesis 1 in the BOSNC

Genesis 1 in the BOTLNT

Genesis 1 in the BOVCB

Genesis 1 in the BOYCB

Genesis 1 in the BPBB

Genesis 1 in the BPH

Genesis 1 in the BSB

Genesis 1 in the CCB

Genesis 1 in the CUV

Genesis 1 in the CUVS

Genesis 1 in the DBT

Genesis 1 in the DGDNT

Genesis 1 in the DHNT

Genesis 1 in the DNT

Genesis 1 in the ELBE

Genesis 1 in the EMTV

Genesis 1 in the ESV

Genesis 1 in the FBV

Genesis 1 in the FEB

Genesis 1 in the GGMNT

Genesis 1 in the GNT

Genesis 1 in the HARY

Genesis 1 in the HNT

Genesis 1 in the IRVA

Genesis 1 in the IRVB

Genesis 1 in the IRVG

Genesis 1 in the IRVH

Genesis 1 in the IRVK

Genesis 1 in the IRVM

Genesis 1 in the IRVM2

Genesis 1 in the IRVO

Genesis 1 in the IRVP

Genesis 1 in the IRVT

Genesis 1 in the IRVU

Genesis 1 in the ISVN

Genesis 1 in the JSNT

Genesis 1 in the KAPI

Genesis 1 in the KBT1ETNIK

Genesis 1 in the KBV

Genesis 1 in the KJV

Genesis 1 in the KNFD

Genesis 1 in the LBA

Genesis 1 in the LBLA

Genesis 1 in the LNT

Genesis 1 in the LSV

Genesis 1 in the MAAL

Genesis 1 in the MBV

Genesis 1 in the MBV2

Genesis 1 in the MHNT

Genesis 1 in the MKNFD

Genesis 1 in the MNG

Genesis 1 in the MNT

Genesis 1 in the MNT2

Genesis 1 in the MRS1T

Genesis 1 in the NAA

Genesis 1 in the NASB

Genesis 1 in the NBLA

Genesis 1 in the NBS

Genesis 1 in the NBVTP

Genesis 1 in the NET2

Genesis 1 in the NIV11

Genesis 1 in the NNT

Genesis 1 in the NNT2

Genesis 1 in the NNT3

Genesis 1 in the PDDPT

Genesis 1 in the PFNT

Genesis 1 in the RMNT

Genesis 1 in the SBIAS

Genesis 1 in the SBIBS

Genesis 1 in the SBIBS2

Genesis 1 in the SBICS

Genesis 1 in the SBIDS

Genesis 1 in the SBIGS

Genesis 1 in the SBIHS

Genesis 1 in the SBIIS

Genesis 1 in the SBIIS2

Genesis 1 in the SBIIS3

Genesis 1 in the SBIKS

Genesis 1 in the SBIKS2

Genesis 1 in the SBIMS

Genesis 1 in the SBIOS

Genesis 1 in the SBIPS

Genesis 1 in the SBISS

Genesis 1 in the SBITS

Genesis 1 in the SBITS2

Genesis 1 in the SBITS3

Genesis 1 in the SBITS4

Genesis 1 in the SBIUS

Genesis 1 in the SBIVS

Genesis 1 in the SBT

Genesis 1 in the SBT1E

Genesis 1 in the SCHL

Genesis 1 in the SNT

Genesis 1 in the SUSU

Genesis 1 in the SUSU2

Genesis 1 in the SYNO

Genesis 1 in the TBIAOTANT

Genesis 1 in the TBT1E

Genesis 1 in the TBT1E2

Genesis 1 in the TFTIP

Genesis 1 in the TFTU

Genesis 1 in the TGNTATF3T

Genesis 1 in the THAI

Genesis 1 in the TNFD

Genesis 1 in the TNT

Genesis 1 in the TNTIK

Genesis 1 in the TNTIL

Genesis 1 in the TNTIN

Genesis 1 in the TNTIP

Genesis 1 in the TNTIZ

Genesis 1 in the TOMA

Genesis 1 in the TTENT

Genesis 1 in the UBG

Genesis 1 in the UGV

Genesis 1 in the UGV2

Genesis 1 in the UGV3

Genesis 1 in the VBL

Genesis 1 in the VDCC

Genesis 1 in the YALU

Genesis 1 in the YAPE

Genesis 1 in the YBVTP

Genesis 1 in the ZBP