Joshua 11 (IRVT2)
1 హాసోరు రాజు యాబీను జరిగిన ఇశ్రాయేలీయులు విజయాలు గూర్చి విని మాదోను రాజు యోబాబుకూ, షిమ్రోను రాజుకూ, అక్షాపు రాజుకూ, 2 ఉత్తరం వైపున ఉన్న మన్యదేశంలో కిన్నెరెతు దక్షిణం వైపున ఉన్న అరాబాలో షెఫేలాలో పడమట ఉన్న దోరు కొండ ప్రాంతంలో ఉన్న రాజులకూ, 3 తూర్పు పడమటి దిక్కుల్లో ఉన్న కనానీయులకూ, అమోరీయులకూ, హిత్తీయులకూ, పెరిజ్జీయులకూ, కొండ ప్రాంతంలో ఉన్న యెబూసీయులకూ, మిస్పా దేశంలోని హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకూ కబురు పంపించాడు. 4 వారంతా సముద్రతీరంలోని ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తమ సైనికులనందరినీ సమకూర్చుకుని, లెక్కలేనన్ని గుర్రాలతో రథాలతో బయలుదేరారు. 5 ఆ రాజులంతా కలిసి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల దగ్గర దిగారు. 6 అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు. రేపు ఈ సమయానికి నేను వారినందరినీ ఇశ్రాయేలు ప్రజల చేతిలో చచ్చినవారుగా అప్పగిస్తాను. నీవు వారి గుర్రాల గుదికాలి నరాలు తెగగోసి వారి రథాలను అగ్నితో కాల్చివేస్తావు” అని యెహోషువతో చెప్పాడు. 7 కాబట్టి యెహోషువ, అతనితో ఉన్న యోధులంతా హఠాత్తుగా మేరోము నీళ్ల దగ్గరికి వచ్చి వారిపై దాడి చేశారు. 8 యెహోవా, ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు. ఇశ్రాయేలీయులు వారిని హతం చేసి మహా సీదోను వరకూ మిశ్రేపొత్మాయిము వరకూ తూర్పు వైపు మిస్పా లోయ వరకూ వారిని తరిమి ఒక్కడు కూడా మిగలకుండా చంపారు. 9 యెహోవా యెహోషువతో చెప్పినట్టు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రాల గుదికాలి నరాలుని తెగగొట్టి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. 10 ఆ సమయంలోనే యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తితో హతం చేశాడు. గతంలో హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ అధిపతి. 11 ఇశ్రాయేలు ప్రజలు దానిలో ఉన్న ప్రతి ఒక్కరినీ కత్తితో హతం చేశారు. ఎవ్వరూ తప్పించుకోకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేశాడు. తరువాత అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాడు. 12 యెహోషువ ఆ రాజులందరినీ హతం చేసి వారి పట్టణాలను వశం చేసుకుని వాటిని నాశనం చేశాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టు అతడు వారిని నిర్మూలం చేశాడు. 13 అయితే యెహోషువ హాసోరుని కాల్చినట్టు మట్టి దిబ్బల మీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు కాల్చలేదు. 14 ఆ పట్టణాలకు సంబంధించిన కొల్లసొమ్మునూ పశువులనూ ఇశ్రాయేలీయులు దోచుకున్నారు. మనుషుల్లో ఒక్కర్నీ విడిచిపెట్టకుండా అందర్నీ నాశనం చేసే వరకూ కత్తితో హతం చేశారు. 15 యెహోవా తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, యెహోషువ ఆప్రకారమే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటి కూడా అతడు చేయకుండా విడిచిపెట్టలేదు. 16 యెహోషువ శేయీరుకు పోయే హాలాకు కొండ నుండి 17 లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు వరకూ ఆ దేశమంతటినీ అంటే కొండ ప్రాంతాన్నీ, దక్షిణ దేశమంతటినీ, గోషేను దేశమంతటినీ, షెఫేలా ప్రదేశాన్నీ, మైదానాన్నీ, ఇశ్రాయేలు కొండలనూ వాటి లోయలనూ వాటి రాజులందర్నీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు. 18 చాలా రోజులు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేసాడు. గిబియోను ప్రజలూ హివ్వీయులూ కాకుండా 19 ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసిన పట్టణం ఇంకేదీ లేదు. ఆ పట్టణాలన్నిటినీ వారు యుద్ధంలో తమ వశం చేసుకున్నారు. 20 “వారిని నిర్మూలం చేయండి” అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు ప్రజలు కనికరం లేకుండా వారిని నాశనం చేయడాని వీలుగా, వారు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. 21 ఆ సమయంలో యెహోషువ వచ్చి పర్వత ప్రాంత దేశంలో అంటే హెబ్రోనులో, దెబీరులో, అనాబులో, యూదా పర్వత ప్రాంతాలన్నిటిలో, ఇశ్రాయేలు ప్రజల పర్వత ప్రాంతాలన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాడు. యెహోషువ వారిని వారి పట్టణాలనూ నిర్మూలం చేశాడు. 22 ఇశ్రాయేలు ప్రజల దేశంలో అనాకీయుల్లో ఎవడూ మిగల్లేదు. గాజా, గాతు, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలారు. 23 యెహోవా మోషేతో చెప్పినట్టు, యెహోషువ దేశాన్నంతటినీ వశం చేసుకున్నాడు. యెహోషువ వారి గోత్రాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్థ్యంగా దాన్ని అప్పగించాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా శ్రాంతిగా ఉంది.
In Other Versions
Joshua 11 in the ANGEFD
Joshua 11 in the ANTPNG2D
Joshua 11 in the AS21
Joshua 11 in the BAGH
Joshua 11 in the BBPNG
Joshua 11 in the BBT1E
Joshua 11 in the BDS
Joshua 11 in the BEV
Joshua 11 in the BHAD
Joshua 11 in the BIB
Joshua 11 in the BLPT
Joshua 11 in the BNT
Joshua 11 in the BNTABOOT
Joshua 11 in the BNTLV
Joshua 11 in the BOATCB
Joshua 11 in the BOATCB2
Joshua 11 in the BOBCV
Joshua 11 in the BOCNT
Joshua 11 in the BOECS
Joshua 11 in the BOGWICC
Joshua 11 in the BOHCB
Joshua 11 in the BOHCV
Joshua 11 in the BOHLNT
Joshua 11 in the BOHNTLTAL
Joshua 11 in the BOICB
Joshua 11 in the BOILNTAP
Joshua 11 in the BOITCV
Joshua 11 in the BOKCV
Joshua 11 in the BOKCV2
Joshua 11 in the BOKHWOG
Joshua 11 in the BOKSSV
Joshua 11 in the BOLCB
Joshua 11 in the BOLCB2
Joshua 11 in the BOMCV
Joshua 11 in the BONAV
Joshua 11 in the BONCB
Joshua 11 in the BONLT
Joshua 11 in the BONUT2
Joshua 11 in the BOPLNT
Joshua 11 in the BOSCB
Joshua 11 in the BOSNC
Joshua 11 in the BOTLNT
Joshua 11 in the BOVCB
Joshua 11 in the BOYCB
Joshua 11 in the BPBB
Joshua 11 in the BPH
Joshua 11 in the BSB
Joshua 11 in the CCB
Joshua 11 in the CUV
Joshua 11 in the CUVS
Joshua 11 in the DBT
Joshua 11 in the DGDNT
Joshua 11 in the DHNT
Joshua 11 in the DNT
Joshua 11 in the ELBE
Joshua 11 in the EMTV
Joshua 11 in the ESV
Joshua 11 in the FBV
Joshua 11 in the FEB
Joshua 11 in the GGMNT
Joshua 11 in the GNT
Joshua 11 in the HARY
Joshua 11 in the HNT
Joshua 11 in the IRVA
Joshua 11 in the IRVB
Joshua 11 in the IRVG
Joshua 11 in the IRVH
Joshua 11 in the IRVK
Joshua 11 in the IRVM
Joshua 11 in the IRVM2
Joshua 11 in the IRVO
Joshua 11 in the IRVP
Joshua 11 in the IRVT
Joshua 11 in the IRVU
Joshua 11 in the ISVN
Joshua 11 in the JSNT
Joshua 11 in the KAPI
Joshua 11 in the KBT1ETNIK
Joshua 11 in the KBV
Joshua 11 in the KJV
Joshua 11 in the KNFD
Joshua 11 in the LBA
Joshua 11 in the LBLA
Joshua 11 in the LNT
Joshua 11 in the LSV
Joshua 11 in the MAAL
Joshua 11 in the MBV
Joshua 11 in the MBV2
Joshua 11 in the MHNT
Joshua 11 in the MKNFD
Joshua 11 in the MNG
Joshua 11 in the MNT
Joshua 11 in the MNT2
Joshua 11 in the MRS1T
Joshua 11 in the NAA
Joshua 11 in the NASB
Joshua 11 in the NBLA
Joshua 11 in the NBS
Joshua 11 in the NBVTP
Joshua 11 in the NET2
Joshua 11 in the NIV11
Joshua 11 in the NNT
Joshua 11 in the NNT2
Joshua 11 in the NNT3
Joshua 11 in the PDDPT
Joshua 11 in the PFNT
Joshua 11 in the RMNT
Joshua 11 in the SBIAS
Joshua 11 in the SBIBS
Joshua 11 in the SBIBS2
Joshua 11 in the SBICS
Joshua 11 in the SBIDS
Joshua 11 in the SBIGS
Joshua 11 in the SBIHS
Joshua 11 in the SBIIS
Joshua 11 in the SBIIS2
Joshua 11 in the SBIIS3
Joshua 11 in the SBIKS
Joshua 11 in the SBIKS2
Joshua 11 in the SBIMS
Joshua 11 in the SBIOS
Joshua 11 in the SBIPS
Joshua 11 in the SBISS
Joshua 11 in the SBITS
Joshua 11 in the SBITS2
Joshua 11 in the SBITS3
Joshua 11 in the SBITS4
Joshua 11 in the SBIUS
Joshua 11 in the SBIVS
Joshua 11 in the SBT
Joshua 11 in the SBT1E
Joshua 11 in the SCHL
Joshua 11 in the SNT
Joshua 11 in the SUSU
Joshua 11 in the SUSU2
Joshua 11 in the SYNO
Joshua 11 in the TBIAOTANT
Joshua 11 in the TBT1E
Joshua 11 in the TBT1E2
Joshua 11 in the TFTIP
Joshua 11 in the TFTU
Joshua 11 in the TGNTATF3T
Joshua 11 in the THAI
Joshua 11 in the TNFD
Joshua 11 in the TNT
Joshua 11 in the TNTIK
Joshua 11 in the TNTIL
Joshua 11 in the TNTIN
Joshua 11 in the TNTIP
Joshua 11 in the TNTIZ
Joshua 11 in the TOMA
Joshua 11 in the TTENT
Joshua 11 in the UBG
Joshua 11 in the UGV
Joshua 11 in the UGV2
Joshua 11 in the UGV3
Joshua 11 in the VBL
Joshua 11 in the VDCC
Joshua 11 in the YALU
Joshua 11 in the YAPE
Joshua 11 in the YBVTP
Joshua 11 in the ZBP