Joshua 19 (IRVT2)
1 రెండవ చీటి షిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది. 2 వారి స్వాస్థ్యం ఏమిటంటే, బెయేర్షెబా, షెబ, మోలాదా, 3 హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, 4 సిక్లగు, బేత్, మార్కాబోదు, హజర్సూసా, 5 బేత్లబాయోతు, షారూహెను అనేవి, 6 వాటి పల్లెలు కాకుండా పదమూడు పట్టణాలు. 7 అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, అనేవి. వాటి పల్లెలు కాకుండా నాలుగు పట్టణాలు. 8 దక్షిణంగా రామతు అనే బాలత్బెయేరు వరకూ ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలన్నీ. ఇవి షిమ్యోను గోత్రం వారి వంశాల ప్రకారం కలిగిన స్వాస్థ్యం. 9 షిమ్యోను వారి స్వాస్థ్యం యూదా వారి ప్రదేశంలోనే ఉంది. ఎందుకంటే యూదా వారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యంలోనే షిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది. 10 మూడవ చీటి వారి వంశం ప్రకారం జెబూలూను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు శారీదు వరకూ వెళ్ళింది. 11 వారి సరిహద్దు పడమటి వైపు మళ్లీ వరకూ, దబ్బాషతు వరకూ సాగి యొక్నెయాముకు ఎదురుగా ఉన్న వాగు వరకూ వ్యాపించి 12 శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది. 13 అక్కడ నుండి తూర్పుగా గిత్తహెపెరుకు, ఇత్కాచీను వరకూ సాగి రిమ్మోను వరకూ వెళ్లి నేయా వైపు తిరిగింది. 14 దాని సరిహద్దు హన్నాతోను వరకూ ఉత్తరం వైపు చుట్టుకుని అక్కడనుండి ఇప్తాయేలు లోయలో అంతమయింది. 15 వాటి పల్లెలు కాక కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు. 16 ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం జెబూలూను గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం. 17 నాలుగవ చీటి వారి వంశం ప్రకారం ఇశ్శాఖారు గోత్రం వారికి వచ్చింది. 18 వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, 19 అబెసు, రెమెతు, ఏన్గన్నీము, 20 ఏన్‌హద్దా, బేత్పస్సెసు, అనే ప్రదేశాల వరకూ 21 వెళ్లి తాబోరు, షహచీమా, బేత్షెమెషు 22 చేరి యొర్దాను దగ్గర అంతమయింది. 23 వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణాలు వారికి వచ్చాయి. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారు గోత్రానికి కలిగిన స్వాస్థ్యం. 24 అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది. 25 వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతెను, అక్షాపు, 26 అలమ్మేలెకు, అమాదు, మిషెయలు. పడమటగా అది కర్మెలు, షీహోర్లిబ్నాతు వరకూ వెళ్లి 27 తూర్పు వైపు బేత్ దాగోను వరకూ తిరిగి జెబూలూను ప్రదేశాన్ని యిప్తాయేలు లోయ దాటి బేతేమెకుకు నెయీయేలుకు ఉత్తరంగా వెళ్తూ 28 ఎడమవైపు అది కాబూలు వరకూ హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకూ వెళ్ళింది. 29 అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, తూరు అనే ప్రాకార పట్టణం వరకూ వెళ్ళింది. అక్కడ నుండి హోసాకు మళ్ళి సముద్ర తీరాన ఉన్న అక్జీబు దగ్గర అంతమయింది. 30 ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరవై రెండు పట్టణాలు. 31 వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం. 32 ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది. 33 వారి సరిహద్దు హెలెపు, జయనన్నీము దగ్గర ఉన్న సింధూర వృక్షం నుండి అదామినికెబ్కు, యబ్నేలు వెళ్లి లక్కూము వరకూ సాగింది. 34 అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరుకు వెళ్లి అక్కడనుండి హుక్కోకు వరకూ సాగింది. దక్షిణం వైపు జెబూలూను, పడమట ఆషేరు దాటి తూర్పున యొర్దాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది. 35 ప్రాకారాలున్న పట్టణాలు ఏవంటే జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు, 36 అదామా, రామా, హాసోరు, 37 కెదెషు, ఎద్రెయీ, ఏన్‌హాసోరు, 38 ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేత్నాతు, బేత్షెమెషు అనేవి. వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్టణాలు. 39 ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి కలిగిన స్వాస్థ్యం. 40 ఏడవ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది. 41 వారి స్వాస్థ్యం సరిహద్దు జొర్యా, 42 ఎష్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను, 43 అయ్యాలోను, యెతా, ఏలోను, 44 తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, 45 బాలాతా, యెహుదు, బెనేబెరకు, 46 గాత్ రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం. 47 దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషెముకు దాను అనే పేరు పెట్టారు. 48 వాటి పల్లెలుగాక ఈ పట్టణాలు వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి కలిగిన స్వాస్థ్యం. 49 సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పంచి పెట్టడం ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడు యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చారు. 50 యెహోవా ఆజ్ఞను అనుసరించి అతడు అడిగిన పట్టణాన్ని, అంటే ఎఫ్రాయిము కొండ ప్రదేశంలో ఉన్న తిమ్నత్సెరహును వారు అతనికి ఇచ్చారు. అతడు ఆ పట్టణాన్ని కట్టించి దానిలో నివసించాడు. 51 యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల్లో ముఖ్యులను షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారం దగ్గర యెహోవా సమక్షంలో చీట్ల వేసి పంపకం చేసిన స్వాస్థ్యాలివి. అప్పుడు వాళ్ళు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు.