2 Samuel 21 (IRVT2)
1 దావీదు పరిపాలిస్తున్న కాలంలో మూడేళ్ళపాటు కరువు కొనసాగింది. దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “సౌలు గిబియోనీయులను హతమార్చాడు. అతణ్ణి బట్టి, నరహంతకులైన అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు ఏర్పడింది.” 2 గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు. వారు అమోరీయుల్లో మిగిలిపోయిన వారు. సౌలు రాజు కాక ముందు ఇశ్రాయేలీయులు “మిమ్మల్ని చంపం” అని గిబియోనీయులతో ఒప్పందం చేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలు, యూదా వారిపట్ల అమితమైన ఆసక్తి కనపరచి గిబియోనీయులను హతం చేస్తూ వచ్చాడు. 3 దావీదు గిబియోనీయులను పిలిపించి “మీరు యెహోవా సొత్తును దీవించడానికి మా దోషం తొలగిపోయేందుకు పరిహారంగా నేను మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు?” అని అడిగాడు. 4 గిబియోనీయులు “సౌలు అతని ఇంటి వారు చేసినదాన్ని బట్టి పరిహారం చేయడానికి వెండి, బంగారాలు గానీ, ఇశ్రాయేలీయుల్లో ఎవరినైనా చంపాలని గానీ మేము కోరుకోవడం లేదు” అన్నారు. అప్పుడు దావీదు “మీరేమి కోరుకున్నా అది మీకు చేస్తాను” అన్నాడు. 5 వారు “ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో ఉండకుండా మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేస్తూ మేము నిర్మూలం అయ్యేలా కీడు కలిగించినవాడి కుమారుల్లో ఏడుగురిని మాకు అప్పగించు. 6 యెహోవా నియమించిన సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సన్నిధానంలో మేము వారిని ఉరితీస్తాం” అని రాజును కోరారు. అప్పుడు రాజు “నేను వారిని మీకు అప్పగిస్తాను” అన్నాడు. 7 అతడు సౌలు కొడుకు యోనాతానుకు యెహోవా పేరిట చేసిన ప్రమాణం కారణంగా యోనాతాను కొడుకు మెఫీబోషెతును కాక, 8 అయ్యా కుమార్తె రిస్పా ద్వారా సౌలుకు పుట్టిన యిద్దరు కొడుకులు అర్మోని, మెఫీబోషెతులను, సౌలు కూతురు మెరాబుకు మెహూలతీయుడైన బర్జిల్లయి కొడుకు అద్రీయేలు ద్వారా పుట్టిన ఐదుగురు కొడుకులను తీసుకువచ్చి గిబియోనీయులకు అప్పగించాడు. 9 వారు ఈ ఏడుగురిని తీసుకువెళ్ళి యెహోవా సన్నిధానంలో కొండ మీద ఏడుగురినీ ఒకే విధంగా ఉరితీశారు. యవల పంట కోతకాలం ఆరంభంలో వారు చనిపోయారు. 10 అయ్యా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకు కొండపైన పరచుకుని కోతకాలం ఆరంభం నుండి మృతదేహాలపై ఆకాశం నుండి వానలు కురిసే దాకా అక్కడే ఉండిపోయి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండా, రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది. 11 సౌలు ఉపపత్ని అయ్యా కూతురు రిస్పా చేసిన పని దావీదుకు తెలిసింది. 12 కాబట్టి దావీదు వెళ్లి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి దగ్గర నుండి తెప్పించాడు. గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానులను హతం చేసి బేత్షాను పట్టణపు వీధిలో వేలాడదీసినప్పుడు యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అక్కడినుంచి దొంగిలించి తెచ్చి తమ దగ్గర ఉంచుకున్నారు. 13 కనుక దావీదు వారి దగ్గర నుండి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను తెప్పించాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సేవకులు ఉరితీసిన ఏడుగురి ఎముకలను సమకూర్చారు. 14 సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను వాటితో కలిపి బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. ఇదంతా చేసిన తరువాత రాజు దేశం కోసం చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు. 15 ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు దావీదు తన సేవకులతో కలసి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో దావీదు నీరసించి సొమ్మసిల్లిపోయాడు. 16 అక్కడ రెఫాయీయుల సంతానం వాడైన ఇష్బిబేనోబ అనేవాడు కొత్తగా చేసిన కత్తి, మూడున్నర కిలోల బరువున్న ఇత్తడి ఈటె పట్టుకుని “నేను దావీదును చంపుతాను” అని చెబుతూ వచ్చాడు. 17 సెరూయా కొడుకు అబీషై రాజును కాపాడి ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. ఇది చూసిన దావీదు మనుషులు “ఇశ్రాయేలీయులకు దీపమైన నువ్వు ఆరిపోకుండా ఉండేలా ఇకపై మాతో కలసి యుద్ధాలకు రావద్దు” అని చెప్పి, అతని చేత ఒట్టు పెట్టించారు. 18 ఆ తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మళ్ళీ యుద్ధం జరిగింది. యుద్ధంలో హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతానం వాడైన సఫును చంపాడు. 19 గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగినప్పుడు అక్కడ బేత్లెహేము నివాసి యహరేయోరెగీము కొడుకు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుణ్ణి చంపాడు. వాడి చేతిలో ఉన్న ఈటె నేతగాని అడ్డకర్ర అంత పెద్దది. 20 మరొక యుద్ధం గాతు దగ్గర జరిగింది. అక్కడ బాగా పొడవైనవాడు ఒకడు ఉన్నాడు. వాడి చేతులకు, కాళ్ళకు ఆరు వేళ్ళు చొప్పున మొత్తం ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతానం వాడు. 21 వాడు ఇశ్రాయేలీయులను దూషిస్తున్నప్పుడు దావీదు సోదరుడు షిమ్యా కొడుకు యోనాతాను వాణ్ణి చంపివేశాడు. 22 గాతులో ఉన్న రెఫాయీయుల సంతతివారైన ఈ నలుగురినీ దావీదు, అతని సేవకులు హతం చేశారు.
In Other Versions
2 Samuel 21 in the ANGEFD
2 Samuel 21 in the ANTPNG2D
2 Samuel 21 in the AS21
2 Samuel 21 in the BAGH
2 Samuel 21 in the BBPNG
2 Samuel 21 in the BBT1E
2 Samuel 21 in the BDS
2 Samuel 21 in the BEV
2 Samuel 21 in the BHAD
2 Samuel 21 in the BIB
2 Samuel 21 in the BLPT
2 Samuel 21 in the BNT
2 Samuel 21 in the BNTABOOT
2 Samuel 21 in the BNTLV
2 Samuel 21 in the BOATCB
2 Samuel 21 in the BOATCB2
2 Samuel 21 in the BOBCV
2 Samuel 21 in the BOCNT
2 Samuel 21 in the BOECS
2 Samuel 21 in the BOGWICC
2 Samuel 21 in the BOHCB
2 Samuel 21 in the BOHCV
2 Samuel 21 in the BOHLNT
2 Samuel 21 in the BOHNTLTAL
2 Samuel 21 in the BOICB
2 Samuel 21 in the BOILNTAP
2 Samuel 21 in the BOITCV
2 Samuel 21 in the BOKCV
2 Samuel 21 in the BOKCV2
2 Samuel 21 in the BOKHWOG
2 Samuel 21 in the BOKSSV
2 Samuel 21 in the BOLCB
2 Samuel 21 in the BOLCB2
2 Samuel 21 in the BOMCV
2 Samuel 21 in the BONAV
2 Samuel 21 in the BONCB
2 Samuel 21 in the BONLT
2 Samuel 21 in the BONUT2
2 Samuel 21 in the BOPLNT
2 Samuel 21 in the BOSCB
2 Samuel 21 in the BOSNC
2 Samuel 21 in the BOTLNT
2 Samuel 21 in the BOVCB
2 Samuel 21 in the BOYCB
2 Samuel 21 in the BPBB
2 Samuel 21 in the BPH
2 Samuel 21 in the BSB
2 Samuel 21 in the CCB
2 Samuel 21 in the CUV
2 Samuel 21 in the CUVS
2 Samuel 21 in the DBT
2 Samuel 21 in the DGDNT
2 Samuel 21 in the DHNT
2 Samuel 21 in the DNT
2 Samuel 21 in the ELBE
2 Samuel 21 in the EMTV
2 Samuel 21 in the ESV
2 Samuel 21 in the FBV
2 Samuel 21 in the FEB
2 Samuel 21 in the GGMNT
2 Samuel 21 in the GNT
2 Samuel 21 in the HARY
2 Samuel 21 in the HNT
2 Samuel 21 in the IRVA
2 Samuel 21 in the IRVB
2 Samuel 21 in the IRVG
2 Samuel 21 in the IRVH
2 Samuel 21 in the IRVK
2 Samuel 21 in the IRVM
2 Samuel 21 in the IRVM2
2 Samuel 21 in the IRVO
2 Samuel 21 in the IRVP
2 Samuel 21 in the IRVT
2 Samuel 21 in the IRVU
2 Samuel 21 in the ISVN
2 Samuel 21 in the JSNT
2 Samuel 21 in the KAPI
2 Samuel 21 in the KBT1ETNIK
2 Samuel 21 in the KBV
2 Samuel 21 in the KJV
2 Samuel 21 in the KNFD
2 Samuel 21 in the LBA
2 Samuel 21 in the LBLA
2 Samuel 21 in the LNT
2 Samuel 21 in the LSV
2 Samuel 21 in the MAAL
2 Samuel 21 in the MBV
2 Samuel 21 in the MBV2
2 Samuel 21 in the MHNT
2 Samuel 21 in the MKNFD
2 Samuel 21 in the MNG
2 Samuel 21 in the MNT
2 Samuel 21 in the MNT2
2 Samuel 21 in the MRS1T
2 Samuel 21 in the NAA
2 Samuel 21 in the NASB
2 Samuel 21 in the NBLA
2 Samuel 21 in the NBS
2 Samuel 21 in the NBVTP
2 Samuel 21 in the NET2
2 Samuel 21 in the NIV11
2 Samuel 21 in the NNT
2 Samuel 21 in the NNT2
2 Samuel 21 in the NNT3
2 Samuel 21 in the PDDPT
2 Samuel 21 in the PFNT
2 Samuel 21 in the RMNT
2 Samuel 21 in the SBIAS
2 Samuel 21 in the SBIBS
2 Samuel 21 in the SBIBS2
2 Samuel 21 in the SBICS
2 Samuel 21 in the SBIDS
2 Samuel 21 in the SBIGS
2 Samuel 21 in the SBIHS
2 Samuel 21 in the SBIIS
2 Samuel 21 in the SBIIS2
2 Samuel 21 in the SBIIS3
2 Samuel 21 in the SBIKS
2 Samuel 21 in the SBIKS2
2 Samuel 21 in the SBIMS
2 Samuel 21 in the SBIOS
2 Samuel 21 in the SBIPS
2 Samuel 21 in the SBISS
2 Samuel 21 in the SBITS
2 Samuel 21 in the SBITS2
2 Samuel 21 in the SBITS3
2 Samuel 21 in the SBITS4
2 Samuel 21 in the SBIUS
2 Samuel 21 in the SBIVS
2 Samuel 21 in the SBT
2 Samuel 21 in the SBT1E
2 Samuel 21 in the SCHL
2 Samuel 21 in the SNT
2 Samuel 21 in the SUSU
2 Samuel 21 in the SUSU2
2 Samuel 21 in the SYNO
2 Samuel 21 in the TBIAOTANT
2 Samuel 21 in the TBT1E
2 Samuel 21 in the TBT1E2
2 Samuel 21 in the TFTIP
2 Samuel 21 in the TFTU
2 Samuel 21 in the TGNTATF3T
2 Samuel 21 in the THAI
2 Samuel 21 in the TNFD
2 Samuel 21 in the TNT
2 Samuel 21 in the TNTIK
2 Samuel 21 in the TNTIL
2 Samuel 21 in the TNTIN
2 Samuel 21 in the TNTIP
2 Samuel 21 in the TNTIZ
2 Samuel 21 in the TOMA
2 Samuel 21 in the TTENT
2 Samuel 21 in the UBG
2 Samuel 21 in the UGV
2 Samuel 21 in the UGV2
2 Samuel 21 in the UGV3
2 Samuel 21 in the VBL
2 Samuel 21 in the VDCC
2 Samuel 21 in the YALU
2 Samuel 21 in the YAPE
2 Samuel 21 in the YBVTP
2 Samuel 21 in the ZBP