Ezekiel 47 (IRVT2)
1 ఆయన నన్ను మందిరపు గుమ్మానికి తోడుకుని వచ్చాడు. మందిరం తూర్పు వైపుకు తిరిగి ఉంది. నేను చూసినపుడు మందిరం గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణ దిశగా మందిరం కుడిపక్కన కింద నుండి పారుతున్నాయి. 2 తరవాత ఆయన ఉత్తరపు గుమ్మం మార్గంలో నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పుకు పోయే దారిలో బయటి గుమ్మానికి తోడుకుని వచ్చాడు. నేను చూసినప్పుడు అక్కడ గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉబికి పారుతున్నాయి. 3 ఆ వ్యక్తి కొలనూలు చేత పట్టుకుని తూర్పు వైపుకు వెళ్లి 540 మీటర్లు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు ఆ నీళ్లు చీలమండ లోతు వచ్చాయి. 4 ఆయన ఇంకో 540 మీటర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మోకాళ్ల లోతు వచ్చాయి. ఇంకా ఆయన 540 మీటర్లు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మొల లోతుకు వచ్చాయి. 5 ఆయన ఇంకా 540 మీటర్లు కొలిచాడు. అప్పుడు ఆ నీళ్లు చాల లోతుగా మారి నేను దాటలేనంత నది కనబడింది. దాటడానికి వీలులేకుండ ఈదాల్సినంత నీటితో ఉన్న నదిగా మారింది. 6 అప్పుడాయన నాతో “నరపుత్రుడా, నీవు చూశావు గదా” అని చెప్పి నన్ను మళ్ళీ నది ఇవతలికి తీసుకుని వచ్చాడు. 7 నేను వెనక్కి వస్తుండగా నదీతీరాన రెండు వైపులా చెట్లు విస్తారంగా కనబడ్డాయి. 8 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి ప్రవహించి అరబాలోకి దిగి సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా మారిపోతాయి. 9 ఈ నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావడం వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి. 10 ఏన్గెదీ పట్టణం మొదలుకుని ఏనెగ్లాయీము పట్టణం వరకూ చేపలు పట్టేవారు దాని ఒడ్డున నిలిచి వలలు వేస్తారు. మహా సముద్రంలో ఉన్నట్టు అన్ని రకాల జాతుల చేపలు దానిలో బహు విస్తారంగా ఉంటాయి. 11 అయితే ఆ సముద్రంలోని బురద స్థలాలు, ఊబి తావులు బాగవ్వక ఉప్పును అందిస్తూ ఉంటాయి. 12 నదీతీరాన రెండు వైపులా ఆహారమిచ్చే సకల జాతుల వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి ప్రవహిస్తున్నది కాబట్టి ఆ చెట్లు ప్రతి నెలా కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికీ వాటి ఆకులు ఔషధాలకు పని చేస్తాయి.” 13 ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకోవాల్సిన భూమి ఇది. యోసేపు సంతానానికి రెండు భాగాలియ్యాలి. 14 నేను ఈ దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు ఈ దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. ఆ విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది. 15 ఉత్తరాన సెదాదుకు పోయే మార్గంలో మహా సముద్రం మొదలుకుని హెత్లోను వరకూ దేశానికి సరిహద్దు. 16 అది హమాతుకు, బేరోతాయుకు, దమస్కు సరిహద్దుకు, హమాతు సరిహద్దుకు మధ్య ఉన్న సిబ్రయీముకు, హవ్రాను సరిహద్దును ఆనుకుని ఉన్న మధ్యస్థలమైన హాజేరుకు వ్యాపిస్తుంది. 17 పడమటి సరిహద్దు హసరేనాను అనే దమస్కు సరిహద్దు పట్టణం, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. 18 తూర్పుదిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు ఇశ్రాయేలీయుల దేశానికి మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకూ దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు. 19 దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటల వరకూ నది దారిలో మహాసముద్రానికి మీ సరిహద్దు ఉంటుంది. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. 20 పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకూ మహాసముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. 21 ఇశ్రాయేలీయుల గోత్రాల ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి. 22 మీరు చీట్లువేసి మీకూ మీలో నివసించి పిల్లలు కన్న పరదేశులకూ ఆస్తులను విభజించేటప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టిన వారిగానే ఆ పరదేశులను మీరు ఎంచాలి. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తాము కూడా స్వాస్థ్యం పొందేలా మీలాగా వారు కూడా చీట్లు వేయాలి. 23 ఏ గోత్రంలో పరదేశులు కాపురముంటారో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వాలి.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
In Other Versions
Ezekiel 47 in the ANGEFD
Ezekiel 47 in the ANTPNG2D
Ezekiel 47 in the AS21
Ezekiel 47 in the BAGH
Ezekiel 47 in the BBPNG
Ezekiel 47 in the BBT1E
Ezekiel 47 in the BDS
Ezekiel 47 in the BEV
Ezekiel 47 in the BHAD
Ezekiel 47 in the BIB
Ezekiel 47 in the BLPT
Ezekiel 47 in the BNT
Ezekiel 47 in the BNTABOOT
Ezekiel 47 in the BNTLV
Ezekiel 47 in the BOATCB
Ezekiel 47 in the BOATCB2
Ezekiel 47 in the BOBCV
Ezekiel 47 in the BOCNT
Ezekiel 47 in the BOECS
Ezekiel 47 in the BOGWICC
Ezekiel 47 in the BOHCB
Ezekiel 47 in the BOHCV
Ezekiel 47 in the BOHLNT
Ezekiel 47 in the BOHNTLTAL
Ezekiel 47 in the BOICB
Ezekiel 47 in the BOILNTAP
Ezekiel 47 in the BOITCV
Ezekiel 47 in the BOKCV
Ezekiel 47 in the BOKCV2
Ezekiel 47 in the BOKHWOG
Ezekiel 47 in the BOKSSV
Ezekiel 47 in the BOLCB
Ezekiel 47 in the BOLCB2
Ezekiel 47 in the BOMCV
Ezekiel 47 in the BONAV
Ezekiel 47 in the BONCB
Ezekiel 47 in the BONLT
Ezekiel 47 in the BONUT2
Ezekiel 47 in the BOPLNT
Ezekiel 47 in the BOSCB
Ezekiel 47 in the BOSNC
Ezekiel 47 in the BOTLNT
Ezekiel 47 in the BOVCB
Ezekiel 47 in the BOYCB
Ezekiel 47 in the BPBB
Ezekiel 47 in the BPH
Ezekiel 47 in the BSB
Ezekiel 47 in the CCB
Ezekiel 47 in the CUV
Ezekiel 47 in the CUVS
Ezekiel 47 in the DBT
Ezekiel 47 in the DGDNT
Ezekiel 47 in the DHNT
Ezekiel 47 in the DNT
Ezekiel 47 in the ELBE
Ezekiel 47 in the EMTV
Ezekiel 47 in the ESV
Ezekiel 47 in the FBV
Ezekiel 47 in the FEB
Ezekiel 47 in the GGMNT
Ezekiel 47 in the GNT
Ezekiel 47 in the HARY
Ezekiel 47 in the HNT
Ezekiel 47 in the IRVA
Ezekiel 47 in the IRVB
Ezekiel 47 in the IRVG
Ezekiel 47 in the IRVH
Ezekiel 47 in the IRVK
Ezekiel 47 in the IRVM
Ezekiel 47 in the IRVM2
Ezekiel 47 in the IRVO
Ezekiel 47 in the IRVP
Ezekiel 47 in the IRVT
Ezekiel 47 in the IRVU
Ezekiel 47 in the ISVN
Ezekiel 47 in the JSNT
Ezekiel 47 in the KAPI
Ezekiel 47 in the KBT1ETNIK
Ezekiel 47 in the KBV
Ezekiel 47 in the KJV
Ezekiel 47 in the KNFD
Ezekiel 47 in the LBA
Ezekiel 47 in the LBLA
Ezekiel 47 in the LNT
Ezekiel 47 in the LSV
Ezekiel 47 in the MAAL
Ezekiel 47 in the MBV
Ezekiel 47 in the MBV2
Ezekiel 47 in the MHNT
Ezekiel 47 in the MKNFD
Ezekiel 47 in the MNG
Ezekiel 47 in the MNT
Ezekiel 47 in the MNT2
Ezekiel 47 in the MRS1T
Ezekiel 47 in the NAA
Ezekiel 47 in the NASB
Ezekiel 47 in the NBLA
Ezekiel 47 in the NBS
Ezekiel 47 in the NBVTP
Ezekiel 47 in the NET2
Ezekiel 47 in the NIV11
Ezekiel 47 in the NNT
Ezekiel 47 in the NNT2
Ezekiel 47 in the NNT3
Ezekiel 47 in the PDDPT
Ezekiel 47 in the PFNT
Ezekiel 47 in the RMNT
Ezekiel 47 in the SBIAS
Ezekiel 47 in the SBIBS
Ezekiel 47 in the SBIBS2
Ezekiel 47 in the SBICS
Ezekiel 47 in the SBIDS
Ezekiel 47 in the SBIGS
Ezekiel 47 in the SBIHS
Ezekiel 47 in the SBIIS
Ezekiel 47 in the SBIIS2
Ezekiel 47 in the SBIIS3
Ezekiel 47 in the SBIKS
Ezekiel 47 in the SBIKS2
Ezekiel 47 in the SBIMS
Ezekiel 47 in the SBIOS
Ezekiel 47 in the SBIPS
Ezekiel 47 in the SBISS
Ezekiel 47 in the SBITS
Ezekiel 47 in the SBITS2
Ezekiel 47 in the SBITS3
Ezekiel 47 in the SBITS4
Ezekiel 47 in the SBIUS
Ezekiel 47 in the SBIVS
Ezekiel 47 in the SBT
Ezekiel 47 in the SBT1E
Ezekiel 47 in the SCHL
Ezekiel 47 in the SNT
Ezekiel 47 in the SUSU
Ezekiel 47 in the SUSU2
Ezekiel 47 in the SYNO
Ezekiel 47 in the TBIAOTANT
Ezekiel 47 in the TBT1E
Ezekiel 47 in the TBT1E2
Ezekiel 47 in the TFTIP
Ezekiel 47 in the TFTU
Ezekiel 47 in the TGNTATF3T
Ezekiel 47 in the THAI
Ezekiel 47 in the TNFD
Ezekiel 47 in the TNT
Ezekiel 47 in the TNTIK
Ezekiel 47 in the TNTIL
Ezekiel 47 in the TNTIN
Ezekiel 47 in the TNTIP
Ezekiel 47 in the TNTIZ
Ezekiel 47 in the TOMA
Ezekiel 47 in the TTENT
Ezekiel 47 in the UBG
Ezekiel 47 in the UGV
Ezekiel 47 in the UGV2
Ezekiel 47 in the UGV3
Ezekiel 47 in the VBL
Ezekiel 47 in the VDCC
Ezekiel 47 in the YALU
Ezekiel 47 in the YAPE
Ezekiel 47 in the YBVTP
Ezekiel 47 in the ZBP