Judges 2 (IRVT2)

1 యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలా అన్నాడు “నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చాను. మీతో చేసిన నిబంధన నేనెప్పుడూ నిరర్ధకం చేయను. 2 మీరు ఈ దేశవాసులతో సంధి చేసుకోకూడదని, వాళ్ళ బలిపీఠాలు విరుగగొట్టాలని ఆజ్ఞ ఇచ్చాను గాని మీరు నా మాట వినలేదు. 3 మీరు చేసిందేమిటి? కాబట్టి నేను మీ ముంగిట్లో నుంచి వాళ్ళని వెళ్లగొట్టను. వాళ్ళు మీ పక్కలో బల్లేలుగా ఉంటారు. వాళ్ళ దేవుళ్ళు మీకు ఉరిగా ఉంటారని చెప్తున్నాను.” 4 యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పినప్పుడు 5 ప్రజలు బిగ్గరగా ఏడ్చారు. కాబట్టి ఆ చోటికి బోకీము అని పేరు పెట్టారు. అక్కడ వాళ్ళు యెహోవాకు హోమబలి అర్పించారు. 6 యెహోషువ ప్రజలను అక్కడ నుంచి సాగనంపినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వాళ్ళకు కేటాయించిన స్థలాలకు వెళ్లారు. 7 యెహోషువ బ్రతికిన కాలమంతటిలోనూ, యెహోషువ తరువాత కాలంలోనూ ఇంకా బ్రతికి ఉండి ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన కార్యాలన్నిటిని చూసిన పెద్దల రోజుల్లోనూ ప్రజలు యెహోవాను సేవిస్తూ ఉన్నారు. 8 నూను కుమారుడు, యెహోవా దాసుడు అయిన యెహోషువ నూట పది సంవత్సరాల వయస్సులో చనిపోయినప్పుడు అతనికి స్వాస్థ్యంగా వచ్చిన ప్రదేశం సరిహద్దులో ఉన్న తిమ్నత్సెరహులో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు. 9 అది ఎఫ్రాయిమీయుల ఎడారిలో గాయషు కొండకు ఉత్తరం దిక్కున ఉంది. 10 ఆ తరం వారంతా తమ తమ పితరుల దగ్గరికి చేరారు. వారి తరువాత యెహోవానుగాని, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను గాని తెలియని తరం ఒకటి మొదలయ్యింది. 11 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు. 12 ఐగుప్తుదేశంలో నుంచి వాళ్ళను రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి, వాళ్ళ చుట్టూ ఉండే ఆ ప్రజల దేవుళ్ళకు సాగిలపడి, యెహోవాకు కోపం పుట్టించారు. 13 వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అష్తారోతు దేవతను పూజించారు. 14 కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రాజుకుంది. ఆయన వారిని దోపిడీగాళ్ళకు అప్పగించాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించాడు కాబట్టి వారు తమ శత్రువులను ఎదిరించలేకపోయారు. 15 వారు యుద్ధానికి ఎటు వెళ్ళినా సరే, ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పినట్టుగానే వారు ఓడిపోయేలా యెహోవా హస్తం వారికీ విరోధంగా ఉంది. వాళ్లకు ఘోర బాధ కలిగింది. 16 అటు తరువాత యెహోవా వాళ్ళ కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. దోచుకొనేవాళ్ళ చేతిలో నుంచి వీళ్ళు ఇశ్రాయేలీయులను రక్షించారు. అయినా ఇస్రాయేల్ ప్రజ ఆ న్యాయాధిపతుల మాట వినలేదు. 17 వాళ్ళ పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గం నుంచి వీళ్ళు త్వరగా తొలగిపోయి, వ్యభిచారంతో సమానంగా ఇతర దేవుళ్ళకు తమను తాము అప్పగించుకుని పూజించారు. తమ పితరులు దేవుని ఆజ్ఞలు అనుసరించినట్టు వాళ్ళు అనుసరించలేదు. 18 వారి శత్రువులు వారిని బాధించగా, ఆ మూలుగులు యెహోవా విని, జాలిపడి, వారి కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. ఆయన ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి, ఒక్కొక్క న్యాయాధిపతి బ్రతికిన కాలమంతా వాళ్ళ శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించాడు. 19 ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడెల్లా వాళ్ళు వెనక్కు తిరిగి ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, పూజిస్తూ, వాటికి సాగిలపడుతూ ఉండేవారు. వారు అలా తమ క్రియల్లోగాని, తమ మూర్ఖ ప్రవర్తనలోగాని దేనినీ విడిచిపెట్టకుండా వాళ్ళ పూర్వికుల కంటే ఇంకా భ్రష్టులై పోయారు. 20 కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రగిలినప్పుడు ఆయన ఇలా అన్నాడు “ఈ ప్రజలు తమ పితరులతో నేను ఏర్పాటు చేసిన వాగ్దానంలోని షరతులు మీరి, నా మాట వినలేదు గనక, 21 నేను నియమించిన షరతులు అనుసరించి వాళ్ళ పితరులు నడిచినట్టు వీళ్ళు కూడా యెహోవా షరతులు అనుసరించి నడుస్తారో లేదో ఆ జాతుల వలన ఇశ్రాయేలీయులను పరీక్షింఛి చూస్తాను. 22 అందుకని యెహోషువ చనిపోయిన కాలంలో మిగిలిన శత్రుజాతుల్లో ఏ జనాంగాన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్లగొట్టను.” 23 ఈ కారణంగానే యెహోవా ఆ జనాంగాన్ని యెహోషువ చేతికి అప్పగించకుండా, వెంటనే వెళ్లగొట్టకుండా వాళ్ళను ఉండనిచ్చాడు.

In Other Versions

Judges 2 in the ANGEFD

Judges 2 in the ANTPNG2D

Judges 2 in the AS21

Judges 2 in the BAGH

Judges 2 in the BBPNG

Judges 2 in the BBT1E

Judges 2 in the BDS

Judges 2 in the BEV

Judges 2 in the BHAD

Judges 2 in the BIB

Judges 2 in the BLPT

Judges 2 in the BNT

Judges 2 in the BNTABOOT

Judges 2 in the BNTLV

Judges 2 in the BOATCB

Judges 2 in the BOATCB2

Judges 2 in the BOBCV

Judges 2 in the BOCNT

Judges 2 in the BOECS

Judges 2 in the BOGWICC

Judges 2 in the BOHCB

Judges 2 in the BOHCV

Judges 2 in the BOHLNT

Judges 2 in the BOHNTLTAL

Judges 2 in the BOICB

Judges 2 in the BOILNTAP

Judges 2 in the BOITCV

Judges 2 in the BOKCV

Judges 2 in the BOKCV2

Judges 2 in the BOKHWOG

Judges 2 in the BOKSSV

Judges 2 in the BOLCB

Judges 2 in the BOLCB2

Judges 2 in the BOMCV

Judges 2 in the BONAV

Judges 2 in the BONCB

Judges 2 in the BONLT

Judges 2 in the BONUT2

Judges 2 in the BOPLNT

Judges 2 in the BOSCB

Judges 2 in the BOSNC

Judges 2 in the BOTLNT

Judges 2 in the BOVCB

Judges 2 in the BOYCB

Judges 2 in the BPBB

Judges 2 in the BPH

Judges 2 in the BSB

Judges 2 in the CCB

Judges 2 in the CUV

Judges 2 in the CUVS

Judges 2 in the DBT

Judges 2 in the DGDNT

Judges 2 in the DHNT

Judges 2 in the DNT

Judges 2 in the ELBE

Judges 2 in the EMTV

Judges 2 in the ESV

Judges 2 in the FBV

Judges 2 in the FEB

Judges 2 in the GGMNT

Judges 2 in the GNT

Judges 2 in the HARY

Judges 2 in the HNT

Judges 2 in the IRVA

Judges 2 in the IRVB

Judges 2 in the IRVG

Judges 2 in the IRVH

Judges 2 in the IRVK

Judges 2 in the IRVM

Judges 2 in the IRVM2

Judges 2 in the IRVO

Judges 2 in the IRVP

Judges 2 in the IRVT

Judges 2 in the IRVU

Judges 2 in the ISVN

Judges 2 in the JSNT

Judges 2 in the KAPI

Judges 2 in the KBT1ETNIK

Judges 2 in the KBV

Judges 2 in the KJV

Judges 2 in the KNFD

Judges 2 in the LBA

Judges 2 in the LBLA

Judges 2 in the LNT

Judges 2 in the LSV

Judges 2 in the MAAL

Judges 2 in the MBV

Judges 2 in the MBV2

Judges 2 in the MHNT

Judges 2 in the MKNFD

Judges 2 in the MNG

Judges 2 in the MNT

Judges 2 in the MNT2

Judges 2 in the MRS1T

Judges 2 in the NAA

Judges 2 in the NASB

Judges 2 in the NBLA

Judges 2 in the NBS

Judges 2 in the NBVTP

Judges 2 in the NET2

Judges 2 in the NIV11

Judges 2 in the NNT

Judges 2 in the NNT2

Judges 2 in the NNT3

Judges 2 in the PDDPT

Judges 2 in the PFNT

Judges 2 in the RMNT

Judges 2 in the SBIAS

Judges 2 in the SBIBS

Judges 2 in the SBIBS2

Judges 2 in the SBICS

Judges 2 in the SBIDS

Judges 2 in the SBIGS

Judges 2 in the SBIHS

Judges 2 in the SBIIS

Judges 2 in the SBIIS2

Judges 2 in the SBIIS3

Judges 2 in the SBIKS

Judges 2 in the SBIKS2

Judges 2 in the SBIMS

Judges 2 in the SBIOS

Judges 2 in the SBIPS

Judges 2 in the SBISS

Judges 2 in the SBITS

Judges 2 in the SBITS2

Judges 2 in the SBITS3

Judges 2 in the SBITS4

Judges 2 in the SBIUS

Judges 2 in the SBIVS

Judges 2 in the SBT

Judges 2 in the SBT1E

Judges 2 in the SCHL

Judges 2 in the SNT

Judges 2 in the SUSU

Judges 2 in the SUSU2

Judges 2 in the SYNO

Judges 2 in the TBIAOTANT

Judges 2 in the TBT1E

Judges 2 in the TBT1E2

Judges 2 in the TFTIP

Judges 2 in the TFTU

Judges 2 in the TGNTATF3T

Judges 2 in the THAI

Judges 2 in the TNFD

Judges 2 in the TNT

Judges 2 in the TNTIK

Judges 2 in the TNTIL

Judges 2 in the TNTIN

Judges 2 in the TNTIP

Judges 2 in the TNTIZ

Judges 2 in the TOMA

Judges 2 in the TTENT

Judges 2 in the UBG

Judges 2 in the UGV

Judges 2 in the UGV2

Judges 2 in the UGV3

Judges 2 in the VBL

Judges 2 in the VDCC

Judges 2 in the YALU

Judges 2 in the YAPE

Judges 2 in the YBVTP

Judges 2 in the ZBP