Malachi 3 (IRVT2)
1 సైన్యాలకు అధిపతియైన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నా దూతను పంపుతున్నాను. అతడు నాకు ముందుగా దారి సిద్ధం చేస్తాడు. ఆ తరువాత మీరు వెతుకుతూ ఉన్న ఆ ప్రభువు, అంటే మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు. ఆయన వస్తున్నాడు. 2 ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలడు? ఆయన కనబడినప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి కొలిమిలో ఉండే నిప్పులాంటివాడు, చాకలి చేతిలోని సబ్బు వంటివాడు. 3 ఆయన వెండిని పరీక్షించి పుటం పెట్టి శుద్ధి చేసేవాడిలాగా కూర్చుంటాడు. వెండి బంగారాలను శుద్ధి చేసి పుటంపెట్టే విధంగా ఆయన లేవీ గోత్రం వారిని శుద్ధి చేస్తాడు. అప్పుడు వాళ్ళు నీతి నియమాలను అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు. 4 గతించిన రోజుల్లో, పూర్వకాలంలో ఉన్నట్టుగా, యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు అర్పించే నైవేద్యాలు యెహోవాకు ప్రీతికరంగా ఉంటాయి. 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టిన వారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. 6 యెహోవానైన నేను మార్పు చెందను గనుక యాకోబు సంతతివారైన మీరు నాశనం కారు. 7 మీ పూర్వీకుల కాలం నుండి మీరు నా నియమాలను లక్ష్యపెట్టకుండా వాటిని తిరస్కరించారు. అయితే ఇప్పుడు మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీవైపు తిరుగుతానని సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పినప్పుడు, ‘మేము దేని విషయంలో తిరగాలి?’ అని మీరు అంటారు. 8 మానవుడు దేవుని సొత్తు దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా సొత్తు దొంగిలించారు. ‘ఏ విషయంలో మేము నీదగ్గర దొంగిలించాం?’ అని మీరు అంటారు. దశమ భాగం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వకుండా దొంగిలించారు. 9 ఈ ప్రజలందరూ నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీరు శాపానికి పాత్రులయ్యారు. 10 నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. 11 “మీ పంటను పురుగులు తినివేయకుండా నేను గద్దిస్తాను. అవి మీ భూమిపై ఉన్న పంటను నాశనం చెయ్యవు. మీ ద్రాక్షచెట్ల ఫలాలు అకాలంలో రాలిపోవు. ఇది సైన్యాలకు అధిపతియైన యెహోవా వాక్కు. 12 ఇక అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. అన్య దేశాల ప్రజలంతా మిమ్మల్ని ధన్య జీవులు అంటారు అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. 13 యెహోవా చెప్పేదేమిటంటే, నాకు విరోధంగా మీరు చాలా గర్వంగా మాట్లాడారు. ‘నిన్ను గూర్చి ఏమని మాట్లాడాం?’ అని మీరు అడుగుతారు. 14 మీరు ఇలా చెప్పుకుంటున్నారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్ధం. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యాల అధిపతియైన యెహోవా సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంవల్ల ఏమి ఉపయోగం? 15 గర్విష్ఠులే ధన్యతలు పొందుతున్నారు, యెహోవాను శోధించే దుర్మార్గులు భద్రంగా ఉంటూ వర్ధిల్లుతున్నారు.’” 16 అప్పుడు, యెహోవా పట్ల భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా ఆ మాటలు విన్నాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గౌరవించే వారి గురించి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధానంలో ఒక పుస్తకం రాశారు. 17 “నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. 18 అప్పుడు నీతిమంతులెవరో దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించేవాళ్ళు ఎవరో, సేవించనివాళ్ళు ఎవరో మీరు మళ్ళీ గుర్తిస్తారు.
In Other Versions
Malachi 3 in the ANGEFD
Malachi 3 in the ANTPNG2D
Malachi 3 in the AS21
Malachi 3 in the BAGH
Malachi 3 in the BBPNG
Malachi 3 in the BBT1E
Malachi 3 in the BDS
Malachi 3 in the BEV
Malachi 3 in the BHAD
Malachi 3 in the BIB
Malachi 3 in the BLPT
Malachi 3 in the BNT
Malachi 3 in the BNTABOOT
Malachi 3 in the BNTLV
Malachi 3 in the BOATCB
Malachi 3 in the BOATCB2
Malachi 3 in the BOBCV
Malachi 3 in the BOCNT
Malachi 3 in the BOECS
Malachi 3 in the BOGWICC
Malachi 3 in the BOHCB
Malachi 3 in the BOHCV
Malachi 3 in the BOHLNT
Malachi 3 in the BOHNTLTAL
Malachi 3 in the BOICB
Malachi 3 in the BOILNTAP
Malachi 3 in the BOITCV
Malachi 3 in the BOKCV
Malachi 3 in the BOKCV2
Malachi 3 in the BOKHWOG
Malachi 3 in the BOKSSV
Malachi 3 in the BOLCB
Malachi 3 in the BOLCB2
Malachi 3 in the BOMCV
Malachi 3 in the BONAV
Malachi 3 in the BONCB
Malachi 3 in the BONLT
Malachi 3 in the BONUT2
Malachi 3 in the BOPLNT
Malachi 3 in the BOSCB
Malachi 3 in the BOSNC
Malachi 3 in the BOTLNT
Malachi 3 in the BOVCB
Malachi 3 in the BOYCB
Malachi 3 in the BPBB
Malachi 3 in the BPH
Malachi 3 in the BSB
Malachi 3 in the CCB
Malachi 3 in the CUV
Malachi 3 in the CUVS
Malachi 3 in the DBT
Malachi 3 in the DGDNT
Malachi 3 in the DHNT
Malachi 3 in the DNT
Malachi 3 in the ELBE
Malachi 3 in the EMTV
Malachi 3 in the ESV
Malachi 3 in the FBV
Malachi 3 in the FEB
Malachi 3 in the GGMNT
Malachi 3 in the GNT
Malachi 3 in the HARY
Malachi 3 in the HNT
Malachi 3 in the IRVA
Malachi 3 in the IRVB
Malachi 3 in the IRVG
Malachi 3 in the IRVH
Malachi 3 in the IRVK
Malachi 3 in the IRVM
Malachi 3 in the IRVM2
Malachi 3 in the IRVO
Malachi 3 in the IRVP
Malachi 3 in the IRVT
Malachi 3 in the IRVU
Malachi 3 in the ISVN
Malachi 3 in the JSNT
Malachi 3 in the KAPI
Malachi 3 in the KBT1ETNIK
Malachi 3 in the KBV
Malachi 3 in the KJV
Malachi 3 in the KNFD
Malachi 3 in the LBA
Malachi 3 in the LBLA
Malachi 3 in the LNT
Malachi 3 in the LSV
Malachi 3 in the MAAL
Malachi 3 in the MBV
Malachi 3 in the MBV2
Malachi 3 in the MHNT
Malachi 3 in the MKNFD
Malachi 3 in the MNG
Malachi 3 in the MNT
Malachi 3 in the MNT2
Malachi 3 in the MRS1T
Malachi 3 in the NAA
Malachi 3 in the NASB
Malachi 3 in the NBLA
Malachi 3 in the NBS
Malachi 3 in the NBVTP
Malachi 3 in the NET2
Malachi 3 in the NIV11
Malachi 3 in the NNT
Malachi 3 in the NNT2
Malachi 3 in the NNT3
Malachi 3 in the PDDPT
Malachi 3 in the PFNT
Malachi 3 in the RMNT
Malachi 3 in the SBIAS
Malachi 3 in the SBIBS
Malachi 3 in the SBIBS2
Malachi 3 in the SBICS
Malachi 3 in the SBIDS
Malachi 3 in the SBIGS
Malachi 3 in the SBIHS
Malachi 3 in the SBIIS
Malachi 3 in the SBIIS2
Malachi 3 in the SBIIS3
Malachi 3 in the SBIKS
Malachi 3 in the SBIKS2
Malachi 3 in the SBIMS
Malachi 3 in the SBIOS
Malachi 3 in the SBIPS
Malachi 3 in the SBISS
Malachi 3 in the SBITS
Malachi 3 in the SBITS2
Malachi 3 in the SBITS3
Malachi 3 in the SBITS4
Malachi 3 in the SBIUS
Malachi 3 in the SBIVS
Malachi 3 in the SBT
Malachi 3 in the SBT1E
Malachi 3 in the SCHL
Malachi 3 in the SNT
Malachi 3 in the SUSU
Malachi 3 in the SUSU2
Malachi 3 in the SYNO
Malachi 3 in the TBIAOTANT
Malachi 3 in the TBT1E
Malachi 3 in the TBT1E2
Malachi 3 in the TFTIP
Malachi 3 in the TFTU
Malachi 3 in the TGNTATF3T
Malachi 3 in the THAI
Malachi 3 in the TNFD
Malachi 3 in the TNT
Malachi 3 in the TNTIK
Malachi 3 in the TNTIL
Malachi 3 in the TNTIN
Malachi 3 in the TNTIP
Malachi 3 in the TNTIZ
Malachi 3 in the TOMA
Malachi 3 in the TTENT
Malachi 3 in the UBG
Malachi 3 in the UGV
Malachi 3 in the UGV2
Malachi 3 in the UGV3
Malachi 3 in the VBL
Malachi 3 in the VDCC
Malachi 3 in the YALU
Malachi 3 in the YAPE
Malachi 3 in the YBVTP
Malachi 3 in the ZBP