Acts 12 (IRVT2)
1 ఆ కాలంలో హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు. 2 యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు. 3 ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు. 4 అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తరువాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు. 5 పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. 6 హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు. 7 ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి. 8 దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు. 9 అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు. 10 మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు. 11 పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు. 12 దీన్ని గ్రహించిన తరువాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు. 13 అతడు తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది. 14 ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది. 15 అందుకు వారు ఆమెను “నువ్వు పిచ్చిదానివి” అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు వారు, “అతని దూత అయి ఉండవచ్చు” అన్నారు. 16 పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయారు. 17 అతడు నెమ్మదిగా ఉండమని వారికి చేతితో సైగ చేసి, ప్రభువు తనను చెరసాల నుండి ఎలా బయటికి తెచ్చాడో వారికి చెప్పి యాకోబుకూ సోదరులకూ ఈ విషయాలు తెలియజేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు. 18 తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాభరాపడ్డారు. 19 హేరోదు అతని కోసం వెతికి కనబడక పోయేసరికి కావలి వారిని ప్రశ్నించి వారికి మరణ శిక్ష విధించాడు. ఆ తరువాత హేరోదు యూదయ నుండి కైసరయ వెళ్ళి అక్కడ నివసించాడు. 20 అప్పట్లో తూరు, సీదోను వాసులపై హేరోదుకు చాలా కోపం వచ్చింది. వారంతా కలిసి, రాజు దగ్గరకి వెళ్ళారు. రాజుకు నచ్చజెప్పి సహాయం చేయాలని వారు రాజభవన పర్యవేక్షకుడైన బ్లాస్తును వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉంది. 21 నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చాడు. 22 ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు. 23 అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు. 24 దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించింది. 25 బర్నబా, సౌలు యెరూషలేములో తమ సేవ నెరవేర్చిన తరువాత మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని తిరిగి వచ్చారు.
In Other Versions
Acts 12 in the ANGEFD
Acts 12 in the ANTPNG2D
Acts 12 in the AS21
Acts 12 in the BAGH
Acts 12 in the BBPNG
Acts 12 in the BBT1E
Acts 12 in the BDS
Acts 12 in the BEV
Acts 12 in the BHAD
Acts 12 in the BIB
Acts 12 in the BLPT
Acts 12 in the BNT
Acts 12 in the BNTABOOT
Acts 12 in the BNTLV
Acts 12 in the BOATCB
Acts 12 in the BOATCB2
Acts 12 in the BOBCV
Acts 12 in the BOCNT
Acts 12 in the BOECS
Acts 12 in the BOGWICC
Acts 12 in the BOHCB
Acts 12 in the BOHCV
Acts 12 in the BOHLNT
Acts 12 in the BOHNTLTAL
Acts 12 in the BOICB
Acts 12 in the BOILNTAP
Acts 12 in the BOITCV
Acts 12 in the BOKCV
Acts 12 in the BOKCV2
Acts 12 in the BOKHWOG
Acts 12 in the BOKSSV
Acts 12 in the BOLCB
Acts 12 in the BOLCB2
Acts 12 in the BOMCV
Acts 12 in the BONAV
Acts 12 in the BONCB
Acts 12 in the BONLT
Acts 12 in the BONUT2
Acts 12 in the BOPLNT
Acts 12 in the BOSCB
Acts 12 in the BOSNC
Acts 12 in the BOTLNT
Acts 12 in the BOVCB
Acts 12 in the BOYCB
Acts 12 in the BPBB
Acts 12 in the BPH
Acts 12 in the BSB
Acts 12 in the CCB
Acts 12 in the CUV
Acts 12 in the CUVS
Acts 12 in the DBT
Acts 12 in the DGDNT
Acts 12 in the DHNT
Acts 12 in the DNT
Acts 12 in the ELBE
Acts 12 in the EMTV
Acts 12 in the ESV
Acts 12 in the FBV
Acts 12 in the FEB
Acts 12 in the GGMNT
Acts 12 in the GNT
Acts 12 in the HARY
Acts 12 in the HNT
Acts 12 in the IRVA
Acts 12 in the IRVB
Acts 12 in the IRVG
Acts 12 in the IRVH
Acts 12 in the IRVK
Acts 12 in the IRVM
Acts 12 in the IRVM2
Acts 12 in the IRVO
Acts 12 in the IRVP
Acts 12 in the IRVT
Acts 12 in the IRVU
Acts 12 in the ISVN
Acts 12 in the JSNT
Acts 12 in the KAPI
Acts 12 in the KBT1ETNIK
Acts 12 in the KBV
Acts 12 in the KJV
Acts 12 in the KNFD
Acts 12 in the LBA
Acts 12 in the LBLA
Acts 12 in the LNT
Acts 12 in the LSV
Acts 12 in the MAAL
Acts 12 in the MBV
Acts 12 in the MBV2
Acts 12 in the MHNT
Acts 12 in the MKNFD
Acts 12 in the MNG
Acts 12 in the MNT
Acts 12 in the MNT2
Acts 12 in the MRS1T
Acts 12 in the NAA
Acts 12 in the NASB
Acts 12 in the NBLA
Acts 12 in the NBS
Acts 12 in the NBVTP
Acts 12 in the NET2
Acts 12 in the NIV11
Acts 12 in the NNT
Acts 12 in the NNT2
Acts 12 in the NNT3
Acts 12 in the PDDPT
Acts 12 in the PFNT
Acts 12 in the RMNT
Acts 12 in the SBIAS
Acts 12 in the SBIBS
Acts 12 in the SBIBS2
Acts 12 in the SBICS
Acts 12 in the SBIDS
Acts 12 in the SBIGS
Acts 12 in the SBIHS
Acts 12 in the SBIIS
Acts 12 in the SBIIS2
Acts 12 in the SBIIS3
Acts 12 in the SBIKS
Acts 12 in the SBIKS2
Acts 12 in the SBIMS
Acts 12 in the SBIOS
Acts 12 in the SBIPS
Acts 12 in the SBISS
Acts 12 in the SBITS
Acts 12 in the SBITS2
Acts 12 in the SBITS3
Acts 12 in the SBITS4
Acts 12 in the SBIUS
Acts 12 in the SBIVS
Acts 12 in the SBT
Acts 12 in the SBT1E
Acts 12 in the SCHL
Acts 12 in the SNT
Acts 12 in the SUSU
Acts 12 in the SUSU2
Acts 12 in the SYNO
Acts 12 in the TBIAOTANT
Acts 12 in the TBT1E
Acts 12 in the TBT1E2
Acts 12 in the TFTIP
Acts 12 in the TFTU
Acts 12 in the TGNTATF3T
Acts 12 in the THAI
Acts 12 in the TNFD
Acts 12 in the TNT
Acts 12 in the TNTIK
Acts 12 in the TNTIL
Acts 12 in the TNTIN
Acts 12 in the TNTIP
Acts 12 in the TNTIZ
Acts 12 in the TOMA
Acts 12 in the TTENT
Acts 12 in the UBG
Acts 12 in the UGV
Acts 12 in the UGV2
Acts 12 in the UGV3
Acts 12 in the VBL
Acts 12 in the VDCC
Acts 12 in the YALU
Acts 12 in the YAPE
Acts 12 in the YBVTP
Acts 12 in the ZBP