Jeremiah 26 (IRVT2)
1 యోషీయా కొడుకు యూదా రాజు యెహోయాకీము పరిపాలన మొదట్లో యెహోవా దగ్గర నుంచి సందేశం ఇలా వచ్చింది, 2 “యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు యెహోవా మందిర ఆవరణంలో నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిని యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే యూదా పౌరులందరికీ ప్రకటించు. వాటిలో ఒక మాట కూడా విడిచిపెట్టవద్దు. 3 ఒకవేళ వాళ్ళు విని తమ దుర్మార్గాన్ని విడిచిపెడితే వాళ్ల మీదికి రప్పిస్తానని చెప్పిన విపత్తును తప్పిస్తాను.” 4 నువ్వు వారితో ఈ మాట చెప్పాలి. “యెహోవా చెప్పేదేమిటంటే, 5 మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, నేను ప్రతిసారీ పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే 6 నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.” 7 యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరంలో పలుకుతూ ఉంటే యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా విన్నారు. 8 అయితే యిర్మీయా యెహోవా చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ప్రజలందరికీ చెప్పడం ముగించిన తరువాత యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా అతణ్ణి పట్టుకుని “నువ్వు తప్పకుండా చావాలి. 9 ఈ మందిరం షిలోహులాగా అవుతుందనీ ఈ పట్టణంలో ఎవరూ నివసించరనీ, పట్టణం పాడైపోతుందనీ యెహోవా పేరున నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు?” అన్నారు. ప్రజలంతా యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు. 10 యూదా అధికారులు ఈ మాటలు విని రాజ భవనంలో నుంచి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిరపు కొత్త ద్వారం ప్రవేశంలో కూర్చున్నారు. 11 యాజకులతో, ప్రవక్తలతో, అధిపతులతో, ప్రజలందరితో వాళ్ళు ఇలా అన్నారు. “మీరు చెవులారా విన్నట్టుగా ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు, కాబట్టి ఇతడు చావడం సమంజసమే.” 12 అప్పుడు యిర్మీయా అధికారులందరితో ప్రజలందరితో ఇలా చెప్పాడు “‘ఈ మందిరానికీ ఈ పట్టణానికీ వ్యతిరేకంగా మీరు విన్న మాటలన్నీ ప్రకటించు’ అని యెహోవా నన్ను పంపాడు. 13 కాబట్టి మీరు ఇప్పుడైనా మీ మార్గాలనూ మీ ప్రవర్తననూ చక్కపరచుకుని మీ యెహోవా దేవుని మాట వినండి. యెహోవా మీమీదికి తేవాలనుకున్న ఆపద రాకుండా చేస్తాడు. 14 ఇదిగో నేను మీ చేతుల్లో ఉన్నాను. మీ దృష్టికేది మంచిదో ఏది సరైనదో అదే నాకు చేయండి. 15 అయితే ఈ మాటలన్నీ చెప్పడానికి నిజంగా యెహోవా మీ దగ్గరికి నన్ను పంపాడు. కాబట్టి, మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీ మీదికీ ఈ పట్టణం మీదికీ దాని నివాసుల మీదికీ తెచ్చుకున్న వాళ్ళవుతారు. దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.” 16 అప్పుడు అధిపతులు, ప్రజలంతా యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు. “ఈ వ్యక్తి మన యెహోవా దేవుని పేరున మనతో మాట్లాడాడు కాబట్టి ఇతడు చావడం సరి కాదు.” 17 దేశంలోని పెద్దల్లో కొంతమంది లేచి అక్కడ చేరిన ప్రజలతో, 18 “యూదా రాజు హిజ్కియా రోజుల్లో మోరషు ఊరివాడు మీకా ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు. సేనల అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న పర్వతం అరణ్యంలోని కొండలాగా అవుతుంది. 19 యూదా రాజు హిజ్కియా గానీ యూదా ప్రజలు గానీ అతణ్ణి చంపారా? రాజు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనను వేడుకుంటే వాళ్లకు చేస్తానన్న విపత్తు చేయలేదు కదా! అయితే మన మీదికి మనమే గొప్ప కీడు తెచ్చుకుంటున్నాము” అని చెప్పారు. 20 కిర్యత్యారీము వాసి షెమయా కొడుకు ఊరియా అనే ఒకడు యెహోవా పేరున ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యిర్మీయా చెప్పిన మాటల్లాగే ఈ పట్టణానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించాడు. 21 యెహోయాకీం రాజు, అతని శూరులంతా అధికారులంతా అతని మాటలు విన్నప్పుడు, రాజు అతణ్ణి చంపాలని చూశాడు. ఊరియా అది తెలుసుకుని భయపడి ఐగుప్తుకు పారిపోయాడు. 22 అయినప్పటికీ యెహోయాకీం రాజు, అక్బోరు కొడుకు ఎల్నాతానునూ అతనితో కూడా కొంతమందిని ఐగుప్తుకు పంపాడు. 23 వాళ్ళు ఐగుప్తు నుంచి ఊరియాను యెహోయాకీం రాజు దగ్గరికి తెచ్చారు. రాజు కత్తితో అతణ్ణి చంపి సాధారణ ప్రజల సమాధుల్లో అతని శవాన్ని పాతిపెట్టాడు. 24 అయితే షాఫాను కొడుకు అహీకాము యిర్మీయాకు సాయపడ్డాడు. అతణ్ణి చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.
In Other Versions
Jeremiah 26 in the ANGEFD
Jeremiah 26 in the ANTPNG2D
Jeremiah 26 in the AS21
Jeremiah 26 in the BAGH
Jeremiah 26 in the BBPNG
Jeremiah 26 in the BBT1E
Jeremiah 26 in the BDS
Jeremiah 26 in the BEV
Jeremiah 26 in the BHAD
Jeremiah 26 in the BIB
Jeremiah 26 in the BLPT
Jeremiah 26 in the BNT
Jeremiah 26 in the BNTABOOT
Jeremiah 26 in the BNTLV
Jeremiah 26 in the BOATCB
Jeremiah 26 in the BOATCB2
Jeremiah 26 in the BOBCV
Jeremiah 26 in the BOCNT
Jeremiah 26 in the BOECS
Jeremiah 26 in the BOGWICC
Jeremiah 26 in the BOHCB
Jeremiah 26 in the BOHCV
Jeremiah 26 in the BOHLNT
Jeremiah 26 in the BOHNTLTAL
Jeremiah 26 in the BOICB
Jeremiah 26 in the BOILNTAP
Jeremiah 26 in the BOITCV
Jeremiah 26 in the BOKCV
Jeremiah 26 in the BOKCV2
Jeremiah 26 in the BOKHWOG
Jeremiah 26 in the BOKSSV
Jeremiah 26 in the BOLCB
Jeremiah 26 in the BOLCB2
Jeremiah 26 in the BOMCV
Jeremiah 26 in the BONAV
Jeremiah 26 in the BONCB
Jeremiah 26 in the BONLT
Jeremiah 26 in the BONUT2
Jeremiah 26 in the BOPLNT
Jeremiah 26 in the BOSCB
Jeremiah 26 in the BOSNC
Jeremiah 26 in the BOTLNT
Jeremiah 26 in the BOVCB
Jeremiah 26 in the BOYCB
Jeremiah 26 in the BPBB
Jeremiah 26 in the BPH
Jeremiah 26 in the BSB
Jeremiah 26 in the CCB
Jeremiah 26 in the CUV
Jeremiah 26 in the CUVS
Jeremiah 26 in the DBT
Jeremiah 26 in the DGDNT
Jeremiah 26 in the DHNT
Jeremiah 26 in the DNT
Jeremiah 26 in the ELBE
Jeremiah 26 in the EMTV
Jeremiah 26 in the ESV
Jeremiah 26 in the FBV
Jeremiah 26 in the FEB
Jeremiah 26 in the GGMNT
Jeremiah 26 in the GNT
Jeremiah 26 in the HARY
Jeremiah 26 in the HNT
Jeremiah 26 in the IRVA
Jeremiah 26 in the IRVB
Jeremiah 26 in the IRVG
Jeremiah 26 in the IRVH
Jeremiah 26 in the IRVK
Jeremiah 26 in the IRVM
Jeremiah 26 in the IRVM2
Jeremiah 26 in the IRVO
Jeremiah 26 in the IRVP
Jeremiah 26 in the IRVT
Jeremiah 26 in the IRVU
Jeremiah 26 in the ISVN
Jeremiah 26 in the JSNT
Jeremiah 26 in the KAPI
Jeremiah 26 in the KBT1ETNIK
Jeremiah 26 in the KBV
Jeremiah 26 in the KJV
Jeremiah 26 in the KNFD
Jeremiah 26 in the LBA
Jeremiah 26 in the LBLA
Jeremiah 26 in the LNT
Jeremiah 26 in the LSV
Jeremiah 26 in the MAAL
Jeremiah 26 in the MBV
Jeremiah 26 in the MBV2
Jeremiah 26 in the MHNT
Jeremiah 26 in the MKNFD
Jeremiah 26 in the MNG
Jeremiah 26 in the MNT
Jeremiah 26 in the MNT2
Jeremiah 26 in the MRS1T
Jeremiah 26 in the NAA
Jeremiah 26 in the NASB
Jeremiah 26 in the NBLA
Jeremiah 26 in the NBS
Jeremiah 26 in the NBVTP
Jeremiah 26 in the NET2
Jeremiah 26 in the NIV11
Jeremiah 26 in the NNT
Jeremiah 26 in the NNT2
Jeremiah 26 in the NNT3
Jeremiah 26 in the PDDPT
Jeremiah 26 in the PFNT
Jeremiah 26 in the RMNT
Jeremiah 26 in the SBIAS
Jeremiah 26 in the SBIBS
Jeremiah 26 in the SBIBS2
Jeremiah 26 in the SBICS
Jeremiah 26 in the SBIDS
Jeremiah 26 in the SBIGS
Jeremiah 26 in the SBIHS
Jeremiah 26 in the SBIIS
Jeremiah 26 in the SBIIS2
Jeremiah 26 in the SBIIS3
Jeremiah 26 in the SBIKS
Jeremiah 26 in the SBIKS2
Jeremiah 26 in the SBIMS
Jeremiah 26 in the SBIOS
Jeremiah 26 in the SBIPS
Jeremiah 26 in the SBISS
Jeremiah 26 in the SBITS
Jeremiah 26 in the SBITS2
Jeremiah 26 in the SBITS3
Jeremiah 26 in the SBITS4
Jeremiah 26 in the SBIUS
Jeremiah 26 in the SBIVS
Jeremiah 26 in the SBT
Jeremiah 26 in the SBT1E
Jeremiah 26 in the SCHL
Jeremiah 26 in the SNT
Jeremiah 26 in the SUSU
Jeremiah 26 in the SUSU2
Jeremiah 26 in the SYNO
Jeremiah 26 in the TBIAOTANT
Jeremiah 26 in the TBT1E
Jeremiah 26 in the TBT1E2
Jeremiah 26 in the TFTIP
Jeremiah 26 in the TFTU
Jeremiah 26 in the TGNTATF3T
Jeremiah 26 in the THAI
Jeremiah 26 in the TNFD
Jeremiah 26 in the TNT
Jeremiah 26 in the TNTIK
Jeremiah 26 in the TNTIL
Jeremiah 26 in the TNTIN
Jeremiah 26 in the TNTIP
Jeremiah 26 in the TNTIZ
Jeremiah 26 in the TOMA
Jeremiah 26 in the TTENT
Jeremiah 26 in the UBG
Jeremiah 26 in the UGV
Jeremiah 26 in the UGV2
Jeremiah 26 in the UGV3
Jeremiah 26 in the VBL
Jeremiah 26 in the VDCC
Jeremiah 26 in the YALU
Jeremiah 26 in the YAPE
Jeremiah 26 in the YBVTP
Jeremiah 26 in the ZBP