Numbers 20 (IRVT2)
1 మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అనే నిర్జన బీడు ప్రాంతానికి వెళ్ళారు. వారు కాదేషులో శిబిరం వేసుకున్నారు. అక్కడ మిర్యాము చనిపోయింది. ఆమెను అక్కడ పాతిపెట్టారు. 2 ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు. 3 ప్రజలు మోషేను విమర్శిస్తూ “మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది! 4 మేమూ మా పశువులూ చనిపోడానికి యెహోవా సమాజాన్ని ఈ నిర్జన బీడు ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చావు? 5 ఈ భయంకరమైన ప్రాంతానికి మమ్మల్ని తీసుకు రావడానికి ఐగుప్తులోనుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఈ ప్రాంతంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు” అన్నారు. 6 అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుంచి సన్నిధి గుడారపు ద్వారం లోకి వెళ్లి సాగిలపడినప్పుడు, యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది. 7 అప్పుడు యెహోవా మోషేతో, 8 “నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి” అన్నాడు. 9 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు. 10 తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు. 11 అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి. 12 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నన్ను నమ్మలేదు, నా పవిత్రత నిలబెట్టలేదు గనక, నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్లలేరు” అన్నాడు. 13 ఈ నీళ్ళ ప్రాంతానికి మెరీబా అని పేరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రత చూపించుకున్నాడు. 14 మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి “నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు. 15 మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు. మేము చాలా రోజులు ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తీయులు మమ్మల్ని, మా పితరులను బాధల పాలు చేశారు. 16 మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం. 17 మమ్మల్ని నీ దేశం గుండా దాటి వెళ్లనివ్వు. పొలాల్లోనుంచైనా, ద్రాక్షతోటల్లోనుంచైనా మేము వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. రాజ మార్గంలో నడిచి వెళ్ళిపోతాం. నీ సరిహద్దులు దాటే వరకూ కుడివైపుకైనా. ఎడమవైపుకైనా తిరుగకుండా వెళ్ళిపోతాం” అని చెప్పించాడు. 18 కాని ఎదోము రాజు “నువ్వు నా దేశంలోగుండా వెళ్లకూడదు. అలా వెళ్తే, నేను ఖడ్గంతో నీ మీద దాడి చేస్తాను” అని జవాబిచ్చాడు. 19 అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో “మేము రాజమార్గంలోనే వెళ్తాం. మేము గాని, మా పశువులుగాని నీ నీళ్లు తాగితే, దాని ఖర్చు చెల్లిస్తాం. కేవలం మమ్మల్ని కాలినడకతో వెళ్లనివ్వు అంతే” అన్నారు. అప్పుడు అతడు “నువ్వు రాకూడదు” అన్నాడు. 20 అప్పుడు ఎదోము రాజు అనేకమంది సైన్యంతో, మహా బలంతో బయలుదేరి, వారి మీదకు వచ్చాడు. 21 ఎదోము రాజు ఇశ్రాయేలును తన సరిహద్దుల్లో గుండా దాటి వెళ్ళడానికి అనుమతించలేదు గనక ఇశ్రాయేలీయులు అతని దగ్గరనుంచి తిరిగి వెళ్ళిపోయారు. 22 అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా కాదేషులోనుంచి ప్రయాణం చేసి హోరు కొండకు వచ్చారు. 23 యెహోవా ఎదోము పొలిమేరల దగ్గరున్న హోరు కొండ దగ్గర మోషే అహరోనులతో మాట్లాడుతూ, 24 “మీరిద్దరూ మెరీబా నీళ్ళ దగ్గర నా మాటలకు ఎదురు తిరిగారు గనక నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించకుండా, తన పితరులతో చేరిపోతాడు. 25 నువ్వు అహరోను, అతని కొడుకు ఎలియాజరును తీసుకుని హోరు కొండెక్కి, 26 అహరోను వస్త్రాలు తీసి అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించు. అహరోను తన పితరులతో చేరి అక్కడ చనిపోతాడు” అన్నాడు. 27 యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉన్నప్పుడు వారు హోరు కొండ ఎక్కారు. 28 మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు. 29 అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ అహరోను కోసం ముప్ఫై రోజులు శోకించారు.
In Other Versions
Numbers 20 in the ANGEFD
Numbers 20 in the ANTPNG2D
Numbers 20 in the AS21
Numbers 20 in the BAGH
Numbers 20 in the BBPNG
Numbers 20 in the BBT1E
Numbers 20 in the BDS
Numbers 20 in the BEV
Numbers 20 in the BHAD
Numbers 20 in the BIB
Numbers 20 in the BLPT
Numbers 20 in the BNT
Numbers 20 in the BNTABOOT
Numbers 20 in the BNTLV
Numbers 20 in the BOATCB
Numbers 20 in the BOATCB2
Numbers 20 in the BOBCV
Numbers 20 in the BOCNT
Numbers 20 in the BOECS
Numbers 20 in the BOGWICC
Numbers 20 in the BOHCB
Numbers 20 in the BOHCV
Numbers 20 in the BOHLNT
Numbers 20 in the BOHNTLTAL
Numbers 20 in the BOICB
Numbers 20 in the BOILNTAP
Numbers 20 in the BOITCV
Numbers 20 in the BOKCV
Numbers 20 in the BOKCV2
Numbers 20 in the BOKHWOG
Numbers 20 in the BOKSSV
Numbers 20 in the BOLCB
Numbers 20 in the BOLCB2
Numbers 20 in the BOMCV
Numbers 20 in the BONAV
Numbers 20 in the BONCB
Numbers 20 in the BONLT
Numbers 20 in the BONUT2
Numbers 20 in the BOPLNT
Numbers 20 in the BOSCB
Numbers 20 in the BOSNC
Numbers 20 in the BOTLNT
Numbers 20 in the BOVCB
Numbers 20 in the BOYCB
Numbers 20 in the BPBB
Numbers 20 in the BPH
Numbers 20 in the BSB
Numbers 20 in the CCB
Numbers 20 in the CUV
Numbers 20 in the CUVS
Numbers 20 in the DBT
Numbers 20 in the DGDNT
Numbers 20 in the DHNT
Numbers 20 in the DNT
Numbers 20 in the ELBE
Numbers 20 in the EMTV
Numbers 20 in the ESV
Numbers 20 in the FBV
Numbers 20 in the FEB
Numbers 20 in the GGMNT
Numbers 20 in the GNT
Numbers 20 in the HARY
Numbers 20 in the HNT
Numbers 20 in the IRVA
Numbers 20 in the IRVB
Numbers 20 in the IRVG
Numbers 20 in the IRVH
Numbers 20 in the IRVK
Numbers 20 in the IRVM
Numbers 20 in the IRVM2
Numbers 20 in the IRVO
Numbers 20 in the IRVP
Numbers 20 in the IRVT
Numbers 20 in the IRVU
Numbers 20 in the ISVN
Numbers 20 in the JSNT
Numbers 20 in the KAPI
Numbers 20 in the KBT1ETNIK
Numbers 20 in the KBV
Numbers 20 in the KJV
Numbers 20 in the KNFD
Numbers 20 in the LBA
Numbers 20 in the LBLA
Numbers 20 in the LNT
Numbers 20 in the LSV
Numbers 20 in the MAAL
Numbers 20 in the MBV
Numbers 20 in the MBV2
Numbers 20 in the MHNT
Numbers 20 in the MKNFD
Numbers 20 in the MNG
Numbers 20 in the MNT
Numbers 20 in the MNT2
Numbers 20 in the MRS1T
Numbers 20 in the NAA
Numbers 20 in the NASB
Numbers 20 in the NBLA
Numbers 20 in the NBS
Numbers 20 in the NBVTP
Numbers 20 in the NET2
Numbers 20 in the NIV11
Numbers 20 in the NNT
Numbers 20 in the NNT2
Numbers 20 in the NNT3
Numbers 20 in the PDDPT
Numbers 20 in the PFNT
Numbers 20 in the RMNT
Numbers 20 in the SBIAS
Numbers 20 in the SBIBS
Numbers 20 in the SBIBS2
Numbers 20 in the SBICS
Numbers 20 in the SBIDS
Numbers 20 in the SBIGS
Numbers 20 in the SBIHS
Numbers 20 in the SBIIS
Numbers 20 in the SBIIS2
Numbers 20 in the SBIIS3
Numbers 20 in the SBIKS
Numbers 20 in the SBIKS2
Numbers 20 in the SBIMS
Numbers 20 in the SBIOS
Numbers 20 in the SBIPS
Numbers 20 in the SBISS
Numbers 20 in the SBITS
Numbers 20 in the SBITS2
Numbers 20 in the SBITS3
Numbers 20 in the SBITS4
Numbers 20 in the SBIUS
Numbers 20 in the SBIVS
Numbers 20 in the SBT
Numbers 20 in the SBT1E
Numbers 20 in the SCHL
Numbers 20 in the SNT
Numbers 20 in the SUSU
Numbers 20 in the SUSU2
Numbers 20 in the SYNO
Numbers 20 in the TBIAOTANT
Numbers 20 in the TBT1E
Numbers 20 in the TBT1E2
Numbers 20 in the TFTIP
Numbers 20 in the TFTU
Numbers 20 in the TGNTATF3T
Numbers 20 in the THAI
Numbers 20 in the TNFD
Numbers 20 in the TNT
Numbers 20 in the TNTIK
Numbers 20 in the TNTIL
Numbers 20 in the TNTIN
Numbers 20 in the TNTIP
Numbers 20 in the TNTIZ
Numbers 20 in the TOMA
Numbers 20 in the TTENT
Numbers 20 in the UBG
Numbers 20 in the UGV
Numbers 20 in the UGV2
Numbers 20 in the UGV3
Numbers 20 in the VBL
Numbers 20 in the VDCC
Numbers 20 in the YALU
Numbers 20 in the YAPE
Numbers 20 in the YBVTP
Numbers 20 in the ZBP