Isaiah 42 (IRVT2)
1 ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు.ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు. 2 ఆయన కేకలు వేయడు, అరవడు. ఆయన స్వరం వీధుల్లో వినబడదు. 3 నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు.ఆయన న్యాయాన్ని నమ్మకంగా అమలుచేస్తాడు. 4 భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకూ ఆయన అలసిపోడు, నిరాశ చెందడు.సముద్ర ద్వీపాలు అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తాయి. 5 ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి,దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, 6 “గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు. 7 యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను.నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను. 8 నేనే యెహోవాను. నా పేరు ఇదే. నా మహిమను మరెవరితోనూ పంచుకోను. నాకు చెందాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనియ్యను. 9 గతంలో చెప్పిన విషయాలు జరిగాయి కదా, ఇదిగో కొత్త సంగతులు మీకు చెబుతున్నాను. అవి జరగక ముందే వాటిని మీకు వెల్లడి చేస్తున్నాను.” 10 సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి.భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి. 11 ఎడారీ, పట్టణాలూ, కేదారు ప్రాంతంలోని గ్రామాలూ సంతోషంతో కేకలు వేస్తాయి.సెల ప్రాంతవాసులు పాటలు పాడతారు. పర్వతశిఖరాల నుండి వారు కేకలు వేస్తారు. 12 ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు. 13 యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు.తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు. 14 చాలాకాలం నుండి నేను మౌనంగా ఉన్నాను. నన్ను నేను అణచుకుంటూ మాట్లాడకుండా ఉన్నాను.ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలాగా నేను బలవంతంగా ఊపిరి తీస్తూ ఒగరుస్తూ ఉన్నాను. 15 పర్వతాలూ కొండలూ పాడైపోయేలా, వాటి మీద ఉన్న చెట్లన్నిటినీ ఎండిపోయేలా చేస్తాను.నదులను ద్వీపాలుగా మారుస్తాను. నీటి మడుగులు ఆరిపోయేలా చేస్తాను. 16 గుడ్డివారిని వారికి తెలియని దారిలో తీసుకువస్తాను. వారు నడవని మార్గాల్లో వారిని నడిపిస్తాను.వారి చీకటిని వెలుగుగా, వంకరదారులను తిన్నగా చేస్తాను. ఈ పనులన్నీ నేను చేస్తాను. వారిని నేను విడిచిపెట్టను. 17 చెక్కిన విగ్రహాలపై నమ్మకముంచి, పోతవిగ్రహాలతో, “మీరే మా దేవుళ్ళు” అని చెప్పేవారు వెనక్కి మళ్ళి సిగ్గు పడతారు. 18 చెవిటివారు వినండి, గుడ్డివారు మీరు గ్రహించగలిగేలా చూడండి. 19 నా సేవకుడు తప్ప గుడ్డివాడు మరెవడు? నేను పంపిన నా దూత తప్ప చెవిటివాడు మరెవడు? నాతో నిబంధనలో ఉన్నవానికంటే, యెహోవా సేవకుని కంటే గుడ్డివాడు ఎవడు? 20 నువ్వు చాలా విషయాలు చూస్తున్నావు గానీ గ్రహించలేకపోతున్నావు. చెవులు తెరిచే ఉన్నాయి గానీ వినడం లేదు. 21 యెహోవా తన నీతికీ తన ధర్మశాస్త్రానికీ ఘనతామహిమలు కలగడంలో సంతోషించాడు. 22 అయితే ఈ ప్రజలు దోపిడీకి గురయ్యారు. వారంతా గుహల్లో చిక్కుకుపోయారు, వారిని బంధకాల్లో ఉంచారు.వారు దోపుడు పాలైనప్పుడు వారినెవరూ విడిపించలేదు. అపహరణకు గురైనప్పుడు “వారిని తిరిగి తీసుకురండి” అని ఎవరూ చెప్పలేదు. 23 మీలో దీన్ని ఎవడు వింటాడు? భవిష్యత్తులోనైనా ఎవడు ఆలకించి వింటాడు? 24 వారు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మార్గాల్లో నడుచుకోలేదు. ఆయన ఉపదేశాన్ని తిరస్కరించారు. అందుకు యెహోవాయే యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించాడు. ఇశ్రాయేలును దోచుకునేవారికి అప్పగించాడు. 25 దాని కారణంగానే ఆయన వారిమీద తన కోపాగ్నినీ యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించాడు.అది వారి చుట్టూ అగ్నిని రాజబెట్టింది గానీ వారు గ్రహించలేదు. అది వారిని కాల్చింది గానీ వారు దాన్ని పట్టించుకోలేదు.
In Other Versions
Isaiah 42 in the ANGEFD
Isaiah 42 in the ANTPNG2D
Isaiah 42 in the AS21
Isaiah 42 in the BAGH
Isaiah 42 in the BBPNG
Isaiah 42 in the BBT1E
Isaiah 42 in the BDS
Isaiah 42 in the BEV
Isaiah 42 in the BHAD
Isaiah 42 in the BIB
Isaiah 42 in the BLPT
Isaiah 42 in the BNT
Isaiah 42 in the BNTABOOT
Isaiah 42 in the BNTLV
Isaiah 42 in the BOATCB
Isaiah 42 in the BOATCB2
Isaiah 42 in the BOBCV
Isaiah 42 in the BOCNT
Isaiah 42 in the BOECS
Isaiah 42 in the BOGWICC
Isaiah 42 in the BOHCB
Isaiah 42 in the BOHCV
Isaiah 42 in the BOHLNT
Isaiah 42 in the BOHNTLTAL
Isaiah 42 in the BOICB
Isaiah 42 in the BOILNTAP
Isaiah 42 in the BOITCV
Isaiah 42 in the BOKCV
Isaiah 42 in the BOKCV2
Isaiah 42 in the BOKHWOG
Isaiah 42 in the BOKSSV
Isaiah 42 in the BOLCB
Isaiah 42 in the BOLCB2
Isaiah 42 in the BOMCV
Isaiah 42 in the BONAV
Isaiah 42 in the BONCB
Isaiah 42 in the BONLT
Isaiah 42 in the BONUT2
Isaiah 42 in the BOPLNT
Isaiah 42 in the BOSCB
Isaiah 42 in the BOSNC
Isaiah 42 in the BOTLNT
Isaiah 42 in the BOVCB
Isaiah 42 in the BOYCB
Isaiah 42 in the BPBB
Isaiah 42 in the BPH
Isaiah 42 in the BSB
Isaiah 42 in the CCB
Isaiah 42 in the CUV
Isaiah 42 in the CUVS
Isaiah 42 in the DBT
Isaiah 42 in the DGDNT
Isaiah 42 in the DHNT
Isaiah 42 in the DNT
Isaiah 42 in the ELBE
Isaiah 42 in the EMTV
Isaiah 42 in the ESV
Isaiah 42 in the FBV
Isaiah 42 in the FEB
Isaiah 42 in the GGMNT
Isaiah 42 in the GNT
Isaiah 42 in the HARY
Isaiah 42 in the HNT
Isaiah 42 in the IRVA
Isaiah 42 in the IRVB
Isaiah 42 in the IRVG
Isaiah 42 in the IRVH
Isaiah 42 in the IRVK
Isaiah 42 in the IRVM
Isaiah 42 in the IRVM2
Isaiah 42 in the IRVO
Isaiah 42 in the IRVP
Isaiah 42 in the IRVT
Isaiah 42 in the IRVU
Isaiah 42 in the ISVN
Isaiah 42 in the JSNT
Isaiah 42 in the KAPI
Isaiah 42 in the KBT1ETNIK
Isaiah 42 in the KBV
Isaiah 42 in the KJV
Isaiah 42 in the KNFD
Isaiah 42 in the LBA
Isaiah 42 in the LBLA
Isaiah 42 in the LNT
Isaiah 42 in the LSV
Isaiah 42 in the MAAL
Isaiah 42 in the MBV
Isaiah 42 in the MBV2
Isaiah 42 in the MHNT
Isaiah 42 in the MKNFD
Isaiah 42 in the MNG
Isaiah 42 in the MNT
Isaiah 42 in the MNT2
Isaiah 42 in the MRS1T
Isaiah 42 in the NAA
Isaiah 42 in the NASB
Isaiah 42 in the NBLA
Isaiah 42 in the NBS
Isaiah 42 in the NBVTP
Isaiah 42 in the NET2
Isaiah 42 in the NIV11
Isaiah 42 in the NNT
Isaiah 42 in the NNT2
Isaiah 42 in the NNT3
Isaiah 42 in the PDDPT
Isaiah 42 in the PFNT
Isaiah 42 in the RMNT
Isaiah 42 in the SBIAS
Isaiah 42 in the SBIBS
Isaiah 42 in the SBIBS2
Isaiah 42 in the SBICS
Isaiah 42 in the SBIDS
Isaiah 42 in the SBIGS
Isaiah 42 in the SBIHS
Isaiah 42 in the SBIIS
Isaiah 42 in the SBIIS2
Isaiah 42 in the SBIIS3
Isaiah 42 in the SBIKS
Isaiah 42 in the SBIKS2
Isaiah 42 in the SBIMS
Isaiah 42 in the SBIOS
Isaiah 42 in the SBIPS
Isaiah 42 in the SBISS
Isaiah 42 in the SBITS
Isaiah 42 in the SBITS2
Isaiah 42 in the SBITS3
Isaiah 42 in the SBITS4
Isaiah 42 in the SBIUS
Isaiah 42 in the SBIVS
Isaiah 42 in the SBT
Isaiah 42 in the SBT1E
Isaiah 42 in the SCHL
Isaiah 42 in the SNT
Isaiah 42 in the SUSU
Isaiah 42 in the SUSU2
Isaiah 42 in the SYNO
Isaiah 42 in the TBIAOTANT
Isaiah 42 in the TBT1E
Isaiah 42 in the TBT1E2
Isaiah 42 in the TFTIP
Isaiah 42 in the TFTU
Isaiah 42 in the TGNTATF3T
Isaiah 42 in the THAI
Isaiah 42 in the TNFD
Isaiah 42 in the TNT
Isaiah 42 in the TNTIK
Isaiah 42 in the TNTIL
Isaiah 42 in the TNTIN
Isaiah 42 in the TNTIP
Isaiah 42 in the TNTIZ
Isaiah 42 in the TOMA
Isaiah 42 in the TTENT
Isaiah 42 in the UBG
Isaiah 42 in the UGV
Isaiah 42 in the UGV2
Isaiah 42 in the UGV3
Isaiah 42 in the VBL
Isaiah 42 in the VDCC
Isaiah 42 in the YALU
Isaiah 42 in the YAPE
Isaiah 42 in the YBVTP
Isaiah 42 in the ZBP