Job 36 (IRVT2)

1 ఎలీహు ఇంకా ఇలా అన్నాడు. 2 కొంతసేపు నన్ను మాట్లాడనియ్యి. కొన్ని సంగతులు నీకు తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని పక్షంగా నేనింకా మాట్లాడవలసి ఉంది. 3 దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను. నీతి అనేది నన్ను సృష్టించిన వాడికే చెందుతుందని అంటాను. 4 నా మాటలు ఏమాత్రం అబద్ధాలు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. 5 దేవుడు బలవంతుడు గానీ ఆయన ఎవరినీ తిరస్కారంగా చూడడు. ఆయన వివేచనాశక్తి ఎంతో బలమైనది. 6 భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు. 7 నీతిమంతులను ఆయన చూడక పోడు. ఆయన వారిని నిత్యం సింహాసనంపై కూర్చునే రాజులతోబాటు కూర్చోబెడతాడు. వారు ఘనత పొందుతారు. 8 వారు సంకెళ్లతో బంధితులైతే, బాధలు అనే తాళ్ళు వారిని కట్టివేస్తే, 9 అప్పుడు వారికి ఆయన వెల్లడిస్తాడు, వారి అపరాధాలు, వారు గర్వంగా ప్రవర్తించిన సంగతులు వారికి తెలియజేస్తాడు. 10 ఉపదేశం వినడానికి వారి చెవులు తెరుస్తాడు. పాపాన్ని విడిచి రండని ఆజ్ఞ ఇస్తాడు. 11 వారు ఆలకించి ఆయనను సేవించినట్టయితే తమ దినాలను క్షేమంగాను తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు. 12 వారు ఆలకించక పోతే వారు కత్తివాత కూలి నశిస్తారు. వారికి జ్ఞానం లేనందువల్ల చనిపోతారు. 13 అయినా భక్తిలేని వారు లోలోపల క్రోధం పెంచుకుంటారు. ఆయన వారిని బంధించినా సరే వారు మొర పెట్టరు. 14 కాబట్టి వారు యవ్వనప్రాయంలోనే మరణిస్తారు. వారి బ్రతుకు అప్రదిష్ట పాలవుతుంది. 15 బాధపడే వారిని వారికి కలిగిన బాధ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు. 16 అంతేగాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. కష్టం లేని విశాల స్థలానికి నిన్ను తోడుకుపోతాడు. నీ భోజనం బల్లపై ఉన్న ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు. 17 దుష్టుల తీర్పు నీలో నిండి ఉంది. న్యాయవిమర్శ, తీర్పు కలిసి నిన్ను పట్టుకున్నాయి. 18 కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు. పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు. 19 నీ సంపదలు నువ్వు బాధల పాలు కాకుండా నిన్ను కాపాడతాయా? నీ బల ప్రభావాలు నీకు సాయపడతాయా? 20 ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయడం కోసం రాత్రి రావాలని కోరుకోవద్దు. మనుషులను తమ స్థలాల్లో నుండి కొట్టివేసే చీకటి కోసం చూడవద్దు. 21 పాపానికి తిరగకుండా జాగ్రత్తపడు. నువ్వు పాపం చెయ్యకుండా ఉండేలా నీ బాధల మూలంగా నీకు పరీక్షలు వస్తున్నాయి. 22 ఆలోచించు, దేవుడు శక్తిశాలి, ఘనుడు. ఆయనను పోలిన ఉపాధ్యాయుడు ఎవరు? 23 ఆయనకు మార్గం సూచించిన వాడెవడు? “నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు” అని ఆయనతో పలకడానికి ఎవరు తెగిస్తారు? 24 ఆయన కార్యాలను కీర్తించు. మనుషులు వాటిని గురించే పాడారు. 25 మనుష్యులంతా వాటిని చూశారు. అయితే వారు దూరంగా నిలిచి ఆ కార్యాలను చూశారు. 26 ఆలోచించు, దేవుడు గొప్పవాడు. మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేము. ఆయన సంవత్సరాలను ఎవరూ లెక్కబెట్టలేరు. 27 ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు. 28 మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానగా కురుస్తాయి. 29 నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా? 30 చూడు, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేస్తాడు. సముద్రాన్ని చీకటితో ఆయన కప్పుతాడు. 31 ఈ విధంగా ఆయన మనుషులకు ఆహారం పెడతాడు. ఆయన ఆహారాన్ని పుష్కలంగా ఇస్తాడు. 32 తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు. 33 వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు.

In Other Versions

Job 36 in the ANGEFD

Job 36 in the ANTPNG2D

Job 36 in the AS21

Job 36 in the BAGH

Job 36 in the BBPNG

Job 36 in the BBT1E

Job 36 in the BDS

Job 36 in the BEV

Job 36 in the BHAD

Job 36 in the BIB

Job 36 in the BLPT

Job 36 in the BNT

Job 36 in the BNTABOOT

Job 36 in the BNTLV

Job 36 in the BOATCB

Job 36 in the BOATCB2

Job 36 in the BOBCV

Job 36 in the BOCNT

Job 36 in the BOECS

Job 36 in the BOGWICC

Job 36 in the BOHCB

Job 36 in the BOHCV

Job 36 in the BOHLNT

Job 36 in the BOHNTLTAL

Job 36 in the BOICB

Job 36 in the BOILNTAP

Job 36 in the BOITCV

Job 36 in the BOKCV

Job 36 in the BOKCV2

Job 36 in the BOKHWOG

Job 36 in the BOKSSV

Job 36 in the BOLCB

Job 36 in the BOLCB2

Job 36 in the BOMCV

Job 36 in the BONAV

Job 36 in the BONCB

Job 36 in the BONLT

Job 36 in the BONUT2

Job 36 in the BOPLNT

Job 36 in the BOSCB

Job 36 in the BOSNC

Job 36 in the BOTLNT

Job 36 in the BOVCB

Job 36 in the BOYCB

Job 36 in the BPBB

Job 36 in the BPH

Job 36 in the BSB

Job 36 in the CCB

Job 36 in the CUV

Job 36 in the CUVS

Job 36 in the DBT

Job 36 in the DGDNT

Job 36 in the DHNT

Job 36 in the DNT

Job 36 in the ELBE

Job 36 in the EMTV

Job 36 in the ESV

Job 36 in the FBV

Job 36 in the FEB

Job 36 in the GGMNT

Job 36 in the GNT

Job 36 in the HARY

Job 36 in the HNT

Job 36 in the IRVA

Job 36 in the IRVB

Job 36 in the IRVG

Job 36 in the IRVH

Job 36 in the IRVK

Job 36 in the IRVM

Job 36 in the IRVM2

Job 36 in the IRVO

Job 36 in the IRVP

Job 36 in the IRVT

Job 36 in the IRVU

Job 36 in the ISVN

Job 36 in the JSNT

Job 36 in the KAPI

Job 36 in the KBT1ETNIK

Job 36 in the KBV

Job 36 in the KJV

Job 36 in the KNFD

Job 36 in the LBA

Job 36 in the LBLA

Job 36 in the LNT

Job 36 in the LSV

Job 36 in the MAAL

Job 36 in the MBV

Job 36 in the MBV2

Job 36 in the MHNT

Job 36 in the MKNFD

Job 36 in the MNG

Job 36 in the MNT

Job 36 in the MNT2

Job 36 in the MRS1T

Job 36 in the NAA

Job 36 in the NASB

Job 36 in the NBLA

Job 36 in the NBS

Job 36 in the NBVTP

Job 36 in the NET2

Job 36 in the NIV11

Job 36 in the NNT

Job 36 in the NNT2

Job 36 in the NNT3

Job 36 in the PDDPT

Job 36 in the PFNT

Job 36 in the RMNT

Job 36 in the SBIAS

Job 36 in the SBIBS

Job 36 in the SBIBS2

Job 36 in the SBICS

Job 36 in the SBIDS

Job 36 in the SBIGS

Job 36 in the SBIHS

Job 36 in the SBIIS

Job 36 in the SBIIS2

Job 36 in the SBIIS3

Job 36 in the SBIKS

Job 36 in the SBIKS2

Job 36 in the SBIMS

Job 36 in the SBIOS

Job 36 in the SBIPS

Job 36 in the SBISS

Job 36 in the SBITS

Job 36 in the SBITS2

Job 36 in the SBITS3

Job 36 in the SBITS4

Job 36 in the SBIUS

Job 36 in the SBIVS

Job 36 in the SBT

Job 36 in the SBT1E

Job 36 in the SCHL

Job 36 in the SNT

Job 36 in the SUSU

Job 36 in the SUSU2

Job 36 in the SYNO

Job 36 in the TBIAOTANT

Job 36 in the TBT1E

Job 36 in the TBT1E2

Job 36 in the TFTIP

Job 36 in the TFTU

Job 36 in the TGNTATF3T

Job 36 in the THAI

Job 36 in the TNFD

Job 36 in the TNT

Job 36 in the TNTIK

Job 36 in the TNTIL

Job 36 in the TNTIN

Job 36 in the TNTIP

Job 36 in the TNTIZ

Job 36 in the TOMA

Job 36 in the TTENT

Job 36 in the UBG

Job 36 in the UGV

Job 36 in the UGV2

Job 36 in the UGV3

Job 36 in the VBL

Job 36 in the VDCC

Job 36 in the YALU

Job 36 in the YAPE

Job 36 in the YBVTP

Job 36 in the ZBP