Numbers 23 (IRVT2)
1 అప్పుడు బిలాము బాలాకుతో “ఇక్కడ నా కోసం ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అన్నాడు. 2 బిలాము చెప్పినట్టు బాలాకు చేసినప్పుడు, బాలాకు, బిలాము ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతునూ ఒక పొట్టేలునూ దహనబలిగా అర్పించారు. 3 ఇంకా బిలాము బాలాకుతో “బలిపీఠం మీద నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. ఒకవేళ నన్ను కలవడానికి యెహోవా వస్తాడేమో. ఆయన నాకు ఏమి చూపిస్తాడో అది నీకు తెలియజేస్తాను” అని చెప్పి చెట్లు లేని కొండ ఎక్కి వెళ్ళాడు. 4 దేవుడు బిలామును కలుసుకున్నప్పుడు, బిలాము ఆయనతో “నేను ఏడు బలిపీఠాలు కట్టి, ప్రతి దాని మీద ఒక దున్నపోతు, ఒక పొట్టేలును అర్పించాను” అని చెప్పాడు. 5 యెహోవా ఒక వార్త బిలాము నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి అతనితో మాట్లాడు” అన్నాడు. 6 అతడు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు నాయకులందరితో తన దహనబలి దగ్గర నిలబడి ఉన్నాడు. 7 అప్పుడు బిలాము ప్రవచనరీతిగా,“అరాము నుంచి బాలాకు, తూర్పు పర్వతాల నుంచి మోయాబురాజు నన్ను రప్పించి,‘వచ్చి, నాకోసం యాకోబును శపించు’ అన్నాడు,‘వచ్చి ఇశ్రాయేలును వ్యతిరేకించు’ అన్నాడు. 8 దేవుడు శపించనివారిని నేనెలా శపించను?దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను? 9 రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను.కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను.చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది.వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు. 10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించ గలరు?ఇశ్రాయేలులో నాల్గోవంతునైనా ఎవరు లేక్కించ గలరు?నీతిమంతుల మరణం లాంటి మరణం నాకు రానివ్వండి.నా జీవిత అంతం ఆయన జనంలా ఉండనివ్వండి” అన్నాడు. 11 బాలాకు బిలాముతో “నువ్వు నాకు ఏం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించాను. కాని నువ్వు వారిని దీవించావు” అన్నాడు. 12 బిలాము జవాబిస్తూ “యెహోవా నా నోట ఉంచినదే నేను జాగ్రత్తగా పలకాలి కదా?” అన్నాడు. 13 అప్పుడు బాలాకు అతనితో “దయచేసి నాతోపాటు ఇంకొక చోటికి రా. అక్కడనుంచి వారిని చూడొచ్చు. చివర ఉన్న వారిని మాత్రమే నువ్వు చూడ గలుగుతావు. వారందరూ నీకు కనిపించరు. అక్కడ నుంచి నా కోసం వారిని శపించాలి” అని చెప్పి 14 పిస్గా కొండపైన ఉన్న కాపలావారి పొలానికి అతన్ని తీసుకెళ్ళి, ఏడు బలిపీఠాలు కట్టించి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు. 15 అప్పుడు బిలాము బాలాకుతో “నువ్వు ఇక్కడ నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. నేను అక్కడ యెహోవాను కలుసుకుంటాను” అన్నాడు. 16 యెహోవా బిలామును కలుసుకుని ఒక వార్త అతని నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి నా వార్త అతనికి అందించు” అన్నాడు. 17 అతడు బాలాకు దగ్గరికి వెళ్లినప్పుడు అతడు తన దహనబలి దగ్గర నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు కూడా అతని దగ్గర ఉన్నారు. బాలాకు “యెహోవా ఏం చెప్పాడు?” అని అడిగాడు. 18 బిలాము ప్రవచనంగా “బాలాకూ, లేచి విను. సిప్పోరు కుమారుడా, ఆలకించు. 19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? 20 చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది.దేవుడు దీవెన ఇచ్చాడు. నేను దాన్ని మార్చలేను. 21 ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు.వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు. 22 అడవిదున్న బలం లాంటి బలంతో దేవుడు వారిని ఐగుప్తులోనుంచి తీసుకొచ్చాడు. 23 యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచెయ్యదు.ఏ శకునం హాని చెయ్యదు.దానికి బదులుగా యాకోబు గురించీ, ఇశ్రాయేలు గురించీ ‘దేవుడు ఏం చేశాడో చూడు’ అని చెప్పుకోవాలి. 24 చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు,ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది.చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు” అని పలికాడు. 25 అప్పుడు బాలాకు బిలాముతో “వారిని శపించడం గాని, ఆశీర్వదించడం గాని ఏదీ చెయ్యొద్దు” అన్నాడు. 26 కాని బిలాము “యెహోవా నాకు చెప్పిందంతా నేను చెయ్యాలని నేను నీతో చెప్పలేదా?” అని బాలాకుకు జవాబిచ్చాడు. 27 బాలాకు బిలాముతో “నువ్వు దయచేసి రా, నేను ఇంకొక చోటికి నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నుంచి నా కోసం నువ్వు వారిని శపించడం దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందేమో” అన్నాడు. 28 బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరానికి బిలామును తీసుకు పోయాడు. 29 బిలాము “ఇక్కడ నాకు ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అని బాలాకుతో చెప్పాడు. 30 బిలాము చెప్పినట్టు బాలాకు చేసి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.
In Other Versions
Numbers 23 in the ANGEFD
Numbers 23 in the ANTPNG2D
Numbers 23 in the AS21
Numbers 23 in the BAGH
Numbers 23 in the BBPNG
Numbers 23 in the BBT1E
Numbers 23 in the BDS
Numbers 23 in the BEV
Numbers 23 in the BHAD
Numbers 23 in the BIB
Numbers 23 in the BLPT
Numbers 23 in the BNT
Numbers 23 in the BNTABOOT
Numbers 23 in the BNTLV
Numbers 23 in the BOATCB
Numbers 23 in the BOATCB2
Numbers 23 in the BOBCV
Numbers 23 in the BOCNT
Numbers 23 in the BOECS
Numbers 23 in the BOGWICC
Numbers 23 in the BOHCB
Numbers 23 in the BOHCV
Numbers 23 in the BOHLNT
Numbers 23 in the BOHNTLTAL
Numbers 23 in the BOICB
Numbers 23 in the BOILNTAP
Numbers 23 in the BOITCV
Numbers 23 in the BOKCV
Numbers 23 in the BOKCV2
Numbers 23 in the BOKHWOG
Numbers 23 in the BOKSSV
Numbers 23 in the BOLCB
Numbers 23 in the BOLCB2
Numbers 23 in the BOMCV
Numbers 23 in the BONAV
Numbers 23 in the BONCB
Numbers 23 in the BONLT
Numbers 23 in the BONUT2
Numbers 23 in the BOPLNT
Numbers 23 in the BOSCB
Numbers 23 in the BOSNC
Numbers 23 in the BOTLNT
Numbers 23 in the BOVCB
Numbers 23 in the BOYCB
Numbers 23 in the BPBB
Numbers 23 in the BPH
Numbers 23 in the BSB
Numbers 23 in the CCB
Numbers 23 in the CUV
Numbers 23 in the CUVS
Numbers 23 in the DBT
Numbers 23 in the DGDNT
Numbers 23 in the DHNT
Numbers 23 in the DNT
Numbers 23 in the ELBE
Numbers 23 in the EMTV
Numbers 23 in the ESV
Numbers 23 in the FBV
Numbers 23 in the FEB
Numbers 23 in the GGMNT
Numbers 23 in the GNT
Numbers 23 in the HARY
Numbers 23 in the HNT
Numbers 23 in the IRVA
Numbers 23 in the IRVB
Numbers 23 in the IRVG
Numbers 23 in the IRVH
Numbers 23 in the IRVK
Numbers 23 in the IRVM
Numbers 23 in the IRVM2
Numbers 23 in the IRVO
Numbers 23 in the IRVP
Numbers 23 in the IRVT
Numbers 23 in the IRVU
Numbers 23 in the ISVN
Numbers 23 in the JSNT
Numbers 23 in the KAPI
Numbers 23 in the KBT1ETNIK
Numbers 23 in the KBV
Numbers 23 in the KJV
Numbers 23 in the KNFD
Numbers 23 in the LBA
Numbers 23 in the LBLA
Numbers 23 in the LNT
Numbers 23 in the LSV
Numbers 23 in the MAAL
Numbers 23 in the MBV
Numbers 23 in the MBV2
Numbers 23 in the MHNT
Numbers 23 in the MKNFD
Numbers 23 in the MNG
Numbers 23 in the MNT
Numbers 23 in the MNT2
Numbers 23 in the MRS1T
Numbers 23 in the NAA
Numbers 23 in the NASB
Numbers 23 in the NBLA
Numbers 23 in the NBS
Numbers 23 in the NBVTP
Numbers 23 in the NET2
Numbers 23 in the NIV11
Numbers 23 in the NNT
Numbers 23 in the NNT2
Numbers 23 in the NNT3
Numbers 23 in the PDDPT
Numbers 23 in the PFNT
Numbers 23 in the RMNT
Numbers 23 in the SBIAS
Numbers 23 in the SBIBS
Numbers 23 in the SBIBS2
Numbers 23 in the SBICS
Numbers 23 in the SBIDS
Numbers 23 in the SBIGS
Numbers 23 in the SBIHS
Numbers 23 in the SBIIS
Numbers 23 in the SBIIS2
Numbers 23 in the SBIIS3
Numbers 23 in the SBIKS
Numbers 23 in the SBIKS2
Numbers 23 in the SBIMS
Numbers 23 in the SBIOS
Numbers 23 in the SBIPS
Numbers 23 in the SBISS
Numbers 23 in the SBITS
Numbers 23 in the SBITS2
Numbers 23 in the SBITS3
Numbers 23 in the SBITS4
Numbers 23 in the SBIUS
Numbers 23 in the SBIVS
Numbers 23 in the SBT
Numbers 23 in the SBT1E
Numbers 23 in the SCHL
Numbers 23 in the SNT
Numbers 23 in the SUSU
Numbers 23 in the SUSU2
Numbers 23 in the SYNO
Numbers 23 in the TBIAOTANT
Numbers 23 in the TBT1E
Numbers 23 in the TBT1E2
Numbers 23 in the TFTIP
Numbers 23 in the TFTU
Numbers 23 in the TGNTATF3T
Numbers 23 in the THAI
Numbers 23 in the TNFD
Numbers 23 in the TNT
Numbers 23 in the TNTIK
Numbers 23 in the TNTIL
Numbers 23 in the TNTIN
Numbers 23 in the TNTIP
Numbers 23 in the TNTIZ
Numbers 23 in the TOMA
Numbers 23 in the TTENT
Numbers 23 in the UBG
Numbers 23 in the UGV
Numbers 23 in the UGV2
Numbers 23 in the UGV3
Numbers 23 in the VBL
Numbers 23 in the VDCC
Numbers 23 in the YALU
Numbers 23 in the YAPE
Numbers 23 in the YBVTP
Numbers 23 in the ZBP