Acts 11 (IRVT2)
1 యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు. 2 పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు, 3 “నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు. 4 అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ, 5 “నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది. 6 దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి. 7 అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను. 8 అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను. 9 రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది. 10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది. 11 వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు. 12 అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం. 13 అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు. 14 నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు. 15 నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు. 16 అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. 17 “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు. 18 వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు. 19 స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు. 20 వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు. 21 ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు. 22 వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది. 23 అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు. 24 అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు. 25 బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు. 26 వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు. 27 ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు. 28 వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది. 29 అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు. 30 వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.
In Other Versions
Acts 11 in the ANGEFD
Acts 11 in the ANTPNG2D
Acts 11 in the AS21
Acts 11 in the BAGH
Acts 11 in the BBPNG
Acts 11 in the BBT1E
Acts 11 in the BDS
Acts 11 in the BEV
Acts 11 in the BHAD
Acts 11 in the BIB
Acts 11 in the BLPT
Acts 11 in the BNT
Acts 11 in the BNTABOOT
Acts 11 in the BNTLV
Acts 11 in the BOATCB
Acts 11 in the BOATCB2
Acts 11 in the BOBCV
Acts 11 in the BOCNT
Acts 11 in the BOECS
Acts 11 in the BOGWICC
Acts 11 in the BOHCB
Acts 11 in the BOHCV
Acts 11 in the BOHLNT
Acts 11 in the BOHNTLTAL
Acts 11 in the BOICB
Acts 11 in the BOILNTAP
Acts 11 in the BOITCV
Acts 11 in the BOKCV
Acts 11 in the BOKCV2
Acts 11 in the BOKHWOG
Acts 11 in the BOKSSV
Acts 11 in the BOLCB
Acts 11 in the BOLCB2
Acts 11 in the BOMCV
Acts 11 in the BONAV
Acts 11 in the BONCB
Acts 11 in the BONLT
Acts 11 in the BONUT2
Acts 11 in the BOPLNT
Acts 11 in the BOSCB
Acts 11 in the BOSNC
Acts 11 in the BOTLNT
Acts 11 in the BOVCB
Acts 11 in the BOYCB
Acts 11 in the BPBB
Acts 11 in the BPH
Acts 11 in the BSB
Acts 11 in the CCB
Acts 11 in the CUV
Acts 11 in the CUVS
Acts 11 in the DBT
Acts 11 in the DGDNT
Acts 11 in the DHNT
Acts 11 in the DNT
Acts 11 in the ELBE
Acts 11 in the EMTV
Acts 11 in the ESV
Acts 11 in the FBV
Acts 11 in the FEB
Acts 11 in the GGMNT
Acts 11 in the GNT
Acts 11 in the HARY
Acts 11 in the HNT
Acts 11 in the IRVA
Acts 11 in the IRVB
Acts 11 in the IRVG
Acts 11 in the IRVH
Acts 11 in the IRVK
Acts 11 in the IRVM
Acts 11 in the IRVM2
Acts 11 in the IRVO
Acts 11 in the IRVP
Acts 11 in the IRVT
Acts 11 in the IRVU
Acts 11 in the ISVN
Acts 11 in the JSNT
Acts 11 in the KAPI
Acts 11 in the KBT1ETNIK
Acts 11 in the KBV
Acts 11 in the KJV
Acts 11 in the KNFD
Acts 11 in the LBA
Acts 11 in the LBLA
Acts 11 in the LNT
Acts 11 in the LSV
Acts 11 in the MAAL
Acts 11 in the MBV
Acts 11 in the MBV2
Acts 11 in the MHNT
Acts 11 in the MKNFD
Acts 11 in the MNG
Acts 11 in the MNT
Acts 11 in the MNT2
Acts 11 in the MRS1T
Acts 11 in the NAA
Acts 11 in the NASB
Acts 11 in the NBLA
Acts 11 in the NBS
Acts 11 in the NBVTP
Acts 11 in the NET2
Acts 11 in the NIV11
Acts 11 in the NNT
Acts 11 in the NNT2
Acts 11 in the NNT3
Acts 11 in the PDDPT
Acts 11 in the PFNT
Acts 11 in the RMNT
Acts 11 in the SBIAS
Acts 11 in the SBIBS
Acts 11 in the SBIBS2
Acts 11 in the SBICS
Acts 11 in the SBIDS
Acts 11 in the SBIGS
Acts 11 in the SBIHS
Acts 11 in the SBIIS
Acts 11 in the SBIIS2
Acts 11 in the SBIIS3
Acts 11 in the SBIKS
Acts 11 in the SBIKS2
Acts 11 in the SBIMS
Acts 11 in the SBIOS
Acts 11 in the SBIPS
Acts 11 in the SBISS
Acts 11 in the SBITS
Acts 11 in the SBITS2
Acts 11 in the SBITS3
Acts 11 in the SBITS4
Acts 11 in the SBIUS
Acts 11 in the SBIVS
Acts 11 in the SBT
Acts 11 in the SBT1E
Acts 11 in the SCHL
Acts 11 in the SNT
Acts 11 in the SUSU
Acts 11 in the SUSU2
Acts 11 in the SYNO
Acts 11 in the TBIAOTANT
Acts 11 in the TBT1E
Acts 11 in the TBT1E2
Acts 11 in the TFTIP
Acts 11 in the TFTU
Acts 11 in the TGNTATF3T
Acts 11 in the THAI
Acts 11 in the TNFD
Acts 11 in the TNT
Acts 11 in the TNTIK
Acts 11 in the TNTIL
Acts 11 in the TNTIN
Acts 11 in the TNTIP
Acts 11 in the TNTIZ
Acts 11 in the TOMA
Acts 11 in the TTENT
Acts 11 in the UBG
Acts 11 in the UGV
Acts 11 in the UGV2
Acts 11 in the UGV3
Acts 11 in the VBL
Acts 11 in the VDCC
Acts 11 in the YALU
Acts 11 in the YAPE
Acts 11 in the YBVTP
Acts 11 in the ZBP