Jeremiah 3 (IRVT2)
1 ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది.అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా.నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. 2 నీ తలెత్తి చెట్లు లేని కొండప్రదేశాలను చూడు. మనుషులు నీతో వ్యభిచారం చేయని స్థలం ఏదైనా ఉందా?ఎడారి దారిలో సంచార జాతి వాడు కాచుకుని ఉన్నట్టు నువ్వు వారి కోసం దారి పక్కన కూర్చుని ఎదురు చూశావు.నీ వ్యభిచారంతో, నీ దుష్ట ప్రవర్తనతో నువ్వు దేశాన్ని అపవిత్రం చేశావు. 3 కాబట్టి వానలు కురవడం లేదు. కడవరి వర్షం ఆగిపోయింది.అయినా నువ్వు కులట మొహం వేసుకుని సిగ్గు పడడం లేదు. 4 అయినా ఇప్పుడు నువ్వు “నా తండ్రీ, చిన్నప్పటి నుండి నాకు దగ్గర స్నేహితుడివి” అని నాకు మొర పెడుతున్నావు. 5 “నువ్వు ఎల్లప్పుడూ కోపిస్తావా? ఇక నీ ఆగ్రహం మానవా?”అని అంటూనే నువ్వు చేయాలనుకున్న దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు. 6 యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు.“ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది. 7 ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది. 8 ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది. 9 రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది. 10 ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణహృదయంతో నా దగ్గరికి రావడం లేదు. 11 కాబట్టి యూదా చేసిన ద్రోహం చూస్తే దానికంటే ఇశ్రాయేలే కొంచెం మంచిది అనిపిస్తున్నది. 12 నువ్వు వెళ్లి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగి రా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను.” ఇదే యెహోవా వాక్కు. 13 నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు.నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు. 14 చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కుఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను. 15 నాకిష్టమైన కాపరులను మీపైన నియమిస్తాను, వారు జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని పాలిస్తారు. 16 ఆ రోజుల్లో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు, ఇక ముందు దాన్ని తయారు చేయరు. ఇదే యెహోవా వాక్కు. 17 ఆ కాలంలో యెరూషలేమును యెహోవా సింహాసనం అంటారు. అన్యజాతులు వారి చెడ్డ హృదయాలను అనుసరించి మూర్ఖులుగా నడుచుకోక ఘనమైన యెహోవా పేరు విని యెరూషలేముకు గుంపులుగా వస్తారు. 18 ఆ రోజుల్లో యూదా వారూ ఇశ్రాయేలు వారూ కలిసి ఉత్తరదేశం నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు. 19 నిన్ను నా కొడుకుగా చేసుకుని, ఏ జనానికీ లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను.నువ్వు నా తండ్రీ అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను. 20 అయినా స్త్రీ తన భర్త పట్ల అపనమ్మకం చూపినట్టు ఇశ్రాయేలు ప్రజలారా,నిజంగా మీరు నాపట్ల అపనమ్మకస్తులయ్యారు. ఇదే యెహోవా వాక్కు. 21 వినండి, చెట్లు లేని ఉన్నత స్థలాల్లో ఒక స్వరం వినబడుతున్నది.వినండి, దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచిపోయినందుకు రోదనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు. 22 ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను.“మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం” అనే ఈ మాటలన్నీ అబద్ధాలు. 23 నిజంగా కొండల మీద జరిగేదంతా మోసం. పర్వతాల మీద చేసిన తంతులన్నీ నిష్ప్రయోజనం.నిజంగా మా దేవుడైన యెహోవా వలన మాత్రమే ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. 24 మా బాల్యంనుండి మా పూర్వీకుల కష్టార్జితాన్నంతా అసహ్యమైన విగ్రహాలు మింగివేశాయి.వారి గొర్రెల్నీ పశువులను, కొడుకులను, కూతుళ్ళను మింగేస్తూ ఉన్నాయి. 25 మన దేవుడైన యెహోవా మాట వినకుండా మనమూ మన పూర్వికులూ బాల్యం నుండి ఈ రోజు వరకూ ఆయనకు విరోధంగా పాపం చేశాం.కాబట్టి రండి, సిగ్గుతో సాష్టాంగపడదాం. మనం కనబడకుండా మన అవమానం మనలను కప్పివేస్తుంది గాక.
In Other Versions
Jeremiah 3 in the ANGEFD
Jeremiah 3 in the ANTPNG2D
Jeremiah 3 in the AS21
Jeremiah 3 in the BAGH
Jeremiah 3 in the BBPNG
Jeremiah 3 in the BBT1E
Jeremiah 3 in the BDS
Jeremiah 3 in the BEV
Jeremiah 3 in the BHAD
Jeremiah 3 in the BIB
Jeremiah 3 in the BLPT
Jeremiah 3 in the BNT
Jeremiah 3 in the BNTABOOT
Jeremiah 3 in the BNTLV
Jeremiah 3 in the BOATCB
Jeremiah 3 in the BOATCB2
Jeremiah 3 in the BOBCV
Jeremiah 3 in the BOCNT
Jeremiah 3 in the BOECS
Jeremiah 3 in the BOGWICC
Jeremiah 3 in the BOHCB
Jeremiah 3 in the BOHCV
Jeremiah 3 in the BOHLNT
Jeremiah 3 in the BOHNTLTAL
Jeremiah 3 in the BOICB
Jeremiah 3 in the BOILNTAP
Jeremiah 3 in the BOITCV
Jeremiah 3 in the BOKCV
Jeremiah 3 in the BOKCV2
Jeremiah 3 in the BOKHWOG
Jeremiah 3 in the BOKSSV
Jeremiah 3 in the BOLCB
Jeremiah 3 in the BOLCB2
Jeremiah 3 in the BOMCV
Jeremiah 3 in the BONAV
Jeremiah 3 in the BONCB
Jeremiah 3 in the BONLT
Jeremiah 3 in the BONUT2
Jeremiah 3 in the BOPLNT
Jeremiah 3 in the BOSCB
Jeremiah 3 in the BOSNC
Jeremiah 3 in the BOTLNT
Jeremiah 3 in the BOVCB
Jeremiah 3 in the BOYCB
Jeremiah 3 in the BPBB
Jeremiah 3 in the BPH
Jeremiah 3 in the BSB
Jeremiah 3 in the CCB
Jeremiah 3 in the CUV
Jeremiah 3 in the CUVS
Jeremiah 3 in the DBT
Jeremiah 3 in the DGDNT
Jeremiah 3 in the DHNT
Jeremiah 3 in the DNT
Jeremiah 3 in the ELBE
Jeremiah 3 in the EMTV
Jeremiah 3 in the ESV
Jeremiah 3 in the FBV
Jeremiah 3 in the FEB
Jeremiah 3 in the GGMNT
Jeremiah 3 in the GNT
Jeremiah 3 in the HARY
Jeremiah 3 in the HNT
Jeremiah 3 in the IRVA
Jeremiah 3 in the IRVB
Jeremiah 3 in the IRVG
Jeremiah 3 in the IRVH
Jeremiah 3 in the IRVK
Jeremiah 3 in the IRVM
Jeremiah 3 in the IRVM2
Jeremiah 3 in the IRVO
Jeremiah 3 in the IRVP
Jeremiah 3 in the IRVT
Jeremiah 3 in the IRVU
Jeremiah 3 in the ISVN
Jeremiah 3 in the JSNT
Jeremiah 3 in the KAPI
Jeremiah 3 in the KBT1ETNIK
Jeremiah 3 in the KBV
Jeremiah 3 in the KJV
Jeremiah 3 in the KNFD
Jeremiah 3 in the LBA
Jeremiah 3 in the LBLA
Jeremiah 3 in the LNT
Jeremiah 3 in the LSV
Jeremiah 3 in the MAAL
Jeremiah 3 in the MBV
Jeremiah 3 in the MBV2
Jeremiah 3 in the MHNT
Jeremiah 3 in the MKNFD
Jeremiah 3 in the MNG
Jeremiah 3 in the MNT
Jeremiah 3 in the MNT2
Jeremiah 3 in the MRS1T
Jeremiah 3 in the NAA
Jeremiah 3 in the NASB
Jeremiah 3 in the NBLA
Jeremiah 3 in the NBS
Jeremiah 3 in the NBVTP
Jeremiah 3 in the NET2
Jeremiah 3 in the NIV11
Jeremiah 3 in the NNT
Jeremiah 3 in the NNT2
Jeremiah 3 in the NNT3
Jeremiah 3 in the PDDPT
Jeremiah 3 in the PFNT
Jeremiah 3 in the RMNT
Jeremiah 3 in the SBIAS
Jeremiah 3 in the SBIBS
Jeremiah 3 in the SBIBS2
Jeremiah 3 in the SBICS
Jeremiah 3 in the SBIDS
Jeremiah 3 in the SBIGS
Jeremiah 3 in the SBIHS
Jeremiah 3 in the SBIIS
Jeremiah 3 in the SBIIS2
Jeremiah 3 in the SBIIS3
Jeremiah 3 in the SBIKS
Jeremiah 3 in the SBIKS2
Jeremiah 3 in the SBIMS
Jeremiah 3 in the SBIOS
Jeremiah 3 in the SBIPS
Jeremiah 3 in the SBISS
Jeremiah 3 in the SBITS
Jeremiah 3 in the SBITS2
Jeremiah 3 in the SBITS3
Jeremiah 3 in the SBITS4
Jeremiah 3 in the SBIUS
Jeremiah 3 in the SBIVS
Jeremiah 3 in the SBT
Jeremiah 3 in the SBT1E
Jeremiah 3 in the SCHL
Jeremiah 3 in the SNT
Jeremiah 3 in the SUSU
Jeremiah 3 in the SUSU2
Jeremiah 3 in the SYNO
Jeremiah 3 in the TBIAOTANT
Jeremiah 3 in the TBT1E
Jeremiah 3 in the TBT1E2
Jeremiah 3 in the TFTIP
Jeremiah 3 in the TFTU
Jeremiah 3 in the TGNTATF3T
Jeremiah 3 in the THAI
Jeremiah 3 in the TNFD
Jeremiah 3 in the TNT
Jeremiah 3 in the TNTIK
Jeremiah 3 in the TNTIL
Jeremiah 3 in the TNTIN
Jeremiah 3 in the TNTIP
Jeremiah 3 in the TNTIZ
Jeremiah 3 in the TOMA
Jeremiah 3 in the TTENT
Jeremiah 3 in the UBG
Jeremiah 3 in the UGV
Jeremiah 3 in the UGV2
Jeremiah 3 in the UGV3
Jeremiah 3 in the VBL
Jeremiah 3 in the VDCC
Jeremiah 3 in the YALU
Jeremiah 3 in the YAPE
Jeremiah 3 in the YBVTP
Jeremiah 3 in the ZBP