Deuteronomy 22 (IRVT2)
1 మీ సాటి పౌరుడి ఎద్దు, లేదా గొర్రె దారి తప్పిపోయి తిరగడం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని దగ్గరికి మళ్లించాలి. 2 మీ సహోదరుడు మీకు అందుబాటులో లేకపోయినా, అతడు మీకు తెలియకపోయినా దాన్ని మీ ఇంటికి తోలుకుపోవాలి. అతడు దాన్ని వెతికే వరకూ అది మీ దగ్గర ఉండాలి. అప్పుడు అతనికి దాన్ని తిరిగి అప్పగించాలి. 3 అతని గాడిద, దుస్తుల విషయంలో కూడా మీరు అలాగే చెయ్యాలి. మీ తోటి ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా మీకు దొరకితే దాన్ని గురించి అలాగే చెయ్యాలి. మీరు దాన్ని చూసీ చూడనట్టు ఉండకూడదు. 4 మీ సాటి మనిషి గాడిద, ఎద్దు దారిలో పడి ఉండడం మీరు చూస్తే వాటిని చూడనట్టు కళ్ళు మూసుకోకూడదు. వాటిని లేపడానికి తప్పకుండా సాయం చెయ్యాలి. 5 ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు. 6 చెట్టు మీదగానీ, నేల మీదగానీ, దారిలోగానీ పక్షిగుడ్లు గానీ పిల్లలు గానీ ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గానీ, ఆ గుడ్ల మీద గానీ పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిపక్షిని తీసుకోకూడదు. 7 మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లలను తీసుకోవచ్చు. 8 మీరు కొత్త ఇల్లు కట్టించుకొనేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దాని మీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు. 9 మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను విత్తకూడదు. అలా చేస్తే మీరు వేసిన పంట, ద్రాక్షతోట రాబడి మొత్తం, దేవాలయానికి ప్రతిష్టితమవుతుంది. 10 ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు. 11 ఉన్ని, జనపనారతో కలిపి నేసిన దుస్తులు ధరించకూడదు. 12 మీరు కప్పుకొనే మీ దుస్తుల నాలుగు అంచులకు అల్లికలు చేసుకోవాలి. 13 ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తరువాత ఆమెను అనుమానించి 14 “ఈ స్త్రీని పెళ్ళి చేసుకుని ఈమె దగ్గరికి వస్తే ఈమెలో నాకు కన్యత్వం కనబడలేదు” అని నేరారోపణ చేసాడనుకోండి. 15 ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం దగ్గర ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి ఆ యువతి కన్యాత్వ నిదర్శనం చూపించాలి. 16 అప్పుడు ఆ స్త్రీ తండ్రి “నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్ళిచేస్తే ఇతడు ‘ఈమెలో కన్యాత్వం కనబడలేదని’ అవమానించి ఆమె మీద నింద మోపాడు. 17 అయితే నా కూతురు కన్య అని రుజువు పరిచే నిదర్శనం ఇదే” అని పెద్దలతో చెప్పి, పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి. 18 అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించి, 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి దగ్గర తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి. 19 ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచి పెట్టకూడదు. 20 అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో 21 పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె తన పుట్టింట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డ పని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు. 22 ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు. 23 కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే 24 ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి. 25 ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి, ఆమెతో శారీరకంగా కలిస్తే, ఆమెతో శారీరకంగా కలిసిన వాడు మాత్రమే చావాలి. 26 ఆ కన్యను ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ కన్య మరణానికి గురి అయ్యేంత పాపం చేయలేదు. ఒకడు తన పొరుగు వాడి మీద పడి చంపేసినట్టే ఇది జరిగింది. 27 అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన ఆ కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడడానికి ఎవరూ లేరు. 28 ఒకడు ప్రదానం జరగని కన్యను పట్టుకుని ఆమెతో శారీరకంగా కలిసిన విషయం తెలిసినప్పుడు 29 ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను ఆవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంత కాలం ఆమెను విడిచి పెట్టకూడదు. 30 ఎవ్వరూ తన తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు.
In Other Versions
Deuteronomy 22 in the ANGEFD
Deuteronomy 22 in the ANTPNG2D
Deuteronomy 22 in the AS21
Deuteronomy 22 in the BAGH
Deuteronomy 22 in the BBPNG
Deuteronomy 22 in the BBT1E
Deuteronomy 22 in the BDS
Deuteronomy 22 in the BEV
Deuteronomy 22 in the BHAD
Deuteronomy 22 in the BIB
Deuteronomy 22 in the BLPT
Deuteronomy 22 in the BNT
Deuteronomy 22 in the BNTABOOT
Deuteronomy 22 in the BNTLV
Deuteronomy 22 in the BOATCB
Deuteronomy 22 in the BOATCB2
Deuteronomy 22 in the BOBCV
Deuteronomy 22 in the BOCNT
Deuteronomy 22 in the BOECS
Deuteronomy 22 in the BOGWICC
Deuteronomy 22 in the BOHCB
Deuteronomy 22 in the BOHCV
Deuteronomy 22 in the BOHLNT
Deuteronomy 22 in the BOHNTLTAL
Deuteronomy 22 in the BOICB
Deuteronomy 22 in the BOILNTAP
Deuteronomy 22 in the BOITCV
Deuteronomy 22 in the BOKCV
Deuteronomy 22 in the BOKCV2
Deuteronomy 22 in the BOKHWOG
Deuteronomy 22 in the BOKSSV
Deuteronomy 22 in the BOLCB
Deuteronomy 22 in the BOLCB2
Deuteronomy 22 in the BOMCV
Deuteronomy 22 in the BONAV
Deuteronomy 22 in the BONCB
Deuteronomy 22 in the BONLT
Deuteronomy 22 in the BONUT2
Deuteronomy 22 in the BOPLNT
Deuteronomy 22 in the BOSCB
Deuteronomy 22 in the BOSNC
Deuteronomy 22 in the BOTLNT
Deuteronomy 22 in the BOVCB
Deuteronomy 22 in the BOYCB
Deuteronomy 22 in the BPBB
Deuteronomy 22 in the BPH
Deuteronomy 22 in the BSB
Deuteronomy 22 in the CCB
Deuteronomy 22 in the CUV
Deuteronomy 22 in the CUVS
Deuteronomy 22 in the DBT
Deuteronomy 22 in the DGDNT
Deuteronomy 22 in the DHNT
Deuteronomy 22 in the DNT
Deuteronomy 22 in the ELBE
Deuteronomy 22 in the EMTV
Deuteronomy 22 in the ESV
Deuteronomy 22 in the FBV
Deuteronomy 22 in the FEB
Deuteronomy 22 in the GGMNT
Deuteronomy 22 in the GNT
Deuteronomy 22 in the HARY
Deuteronomy 22 in the HNT
Deuteronomy 22 in the IRVA
Deuteronomy 22 in the IRVB
Deuteronomy 22 in the IRVG
Deuteronomy 22 in the IRVH
Deuteronomy 22 in the IRVK
Deuteronomy 22 in the IRVM
Deuteronomy 22 in the IRVM2
Deuteronomy 22 in the IRVO
Deuteronomy 22 in the IRVP
Deuteronomy 22 in the IRVT
Deuteronomy 22 in the IRVU
Deuteronomy 22 in the ISVN
Deuteronomy 22 in the JSNT
Deuteronomy 22 in the KAPI
Deuteronomy 22 in the KBT1ETNIK
Deuteronomy 22 in the KBV
Deuteronomy 22 in the KJV
Deuteronomy 22 in the KNFD
Deuteronomy 22 in the LBA
Deuteronomy 22 in the LBLA
Deuteronomy 22 in the LNT
Deuteronomy 22 in the LSV
Deuteronomy 22 in the MAAL
Deuteronomy 22 in the MBV
Deuteronomy 22 in the MBV2
Deuteronomy 22 in the MHNT
Deuteronomy 22 in the MKNFD
Deuteronomy 22 in the MNG
Deuteronomy 22 in the MNT
Deuteronomy 22 in the MNT2
Deuteronomy 22 in the MRS1T
Deuteronomy 22 in the NAA
Deuteronomy 22 in the NASB
Deuteronomy 22 in the NBLA
Deuteronomy 22 in the NBS
Deuteronomy 22 in the NBVTP
Deuteronomy 22 in the NET2
Deuteronomy 22 in the NIV11
Deuteronomy 22 in the NNT
Deuteronomy 22 in the NNT2
Deuteronomy 22 in the NNT3
Deuteronomy 22 in the PDDPT
Deuteronomy 22 in the PFNT
Deuteronomy 22 in the RMNT
Deuteronomy 22 in the SBIAS
Deuteronomy 22 in the SBIBS
Deuteronomy 22 in the SBIBS2
Deuteronomy 22 in the SBICS
Deuteronomy 22 in the SBIDS
Deuteronomy 22 in the SBIGS
Deuteronomy 22 in the SBIHS
Deuteronomy 22 in the SBIIS
Deuteronomy 22 in the SBIIS2
Deuteronomy 22 in the SBIIS3
Deuteronomy 22 in the SBIKS
Deuteronomy 22 in the SBIKS2
Deuteronomy 22 in the SBIMS
Deuteronomy 22 in the SBIOS
Deuteronomy 22 in the SBIPS
Deuteronomy 22 in the SBISS
Deuteronomy 22 in the SBITS
Deuteronomy 22 in the SBITS2
Deuteronomy 22 in the SBITS3
Deuteronomy 22 in the SBITS4
Deuteronomy 22 in the SBIUS
Deuteronomy 22 in the SBIVS
Deuteronomy 22 in the SBT
Deuteronomy 22 in the SBT1E
Deuteronomy 22 in the SCHL
Deuteronomy 22 in the SNT
Deuteronomy 22 in the SUSU
Deuteronomy 22 in the SUSU2
Deuteronomy 22 in the SYNO
Deuteronomy 22 in the TBIAOTANT
Deuteronomy 22 in the TBT1E
Deuteronomy 22 in the TBT1E2
Deuteronomy 22 in the TFTIP
Deuteronomy 22 in the TFTU
Deuteronomy 22 in the TGNTATF3T
Deuteronomy 22 in the THAI
Deuteronomy 22 in the TNFD
Deuteronomy 22 in the TNT
Deuteronomy 22 in the TNTIK
Deuteronomy 22 in the TNTIL
Deuteronomy 22 in the TNTIN
Deuteronomy 22 in the TNTIP
Deuteronomy 22 in the TNTIZ
Deuteronomy 22 in the TOMA
Deuteronomy 22 in the TTENT
Deuteronomy 22 in the UBG
Deuteronomy 22 in the UGV
Deuteronomy 22 in the UGV2
Deuteronomy 22 in the UGV3
Deuteronomy 22 in the VBL
Deuteronomy 22 in the VDCC
Deuteronomy 22 in the YALU
Deuteronomy 22 in the YAPE
Deuteronomy 22 in the YBVTP
Deuteronomy 22 in the ZBP